ఇది నేషనల్ పార్టీ.. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదు..రేవంత్‌పై వీహెచ్ ఫైర్..

| Edited By: Pardhasaradhi Peri

Mar 12, 2020 | 8:12 PM

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లి భూముల కబ్జా వ్యవహారంపై సొంత పార్టీ నేతలే వ్యతిరకంగా మాట్లాడుతున్నారు. రేవంత్ తీరుతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఇప్పటికే సొంత పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇదిలా ఉంటే.. మరో సీనియర్ నేత వీ.హన్మంతరావు కూడా రేవంత్ తీరుపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా […]

ఇది నేషనల్ పార్టీ.. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదు..రేవంత్‌పై వీహెచ్ ఫైర్..
Follow us on

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లి భూముల కబ్జా వ్యవహారంపై సొంత పార్టీ నేతలే వ్యతిరకంగా మాట్లాడుతున్నారు. రేవంత్ తీరుతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఇప్పటికే సొంత పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇదిలా ఉంటే.. మరో సీనియర్ నేత వీ.హన్మంతరావు కూడా రేవంత్ తీరుపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లి భూకబ్జాల బాగోతంపై నీపై ఆరోపణలు వచ్చాయని.. అవి నిజమో కాదో.. న్యాయపరంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలా కాకుండా ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తూ.. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలు వేయడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని.. ఇక్కడ ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదని వీహెచ్ అన్నారు.

మరోవైపు గోపన్‌పల్లి భూ ఆక్రమణలపై త్వరలోనే స్పందిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి గురువారం శాసన మండలిలో తెలిపారు. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, త్వరలో ఈ భూకబ్జా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. అటు గోపన్‌పల్లి భూదందాపై కూడా త్వరలోనే స్పందిస్తామన్నారు. దళిత భూములను కబ్జా చేసిన రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.