ప్రభాస్.. బాలకృష్ణ మూవీకి సీక్వెల్ చేస్తున్నారా..!

ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న ప్రభాస్.. ఆ తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరక్షన్‌లో నటించనున్న విషయం తెలిసిందే.

ప్రభాస్.. బాలకృష్ణ మూవీకి సీక్వెల్ చేస్తున్నారా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 12, 2020 | 9:26 PM

ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న ప్రభాస్.. ఆ తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరక్షన్‌లో నటించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో గానీ.. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. దాదాపు 400 కోట్లతో వైజయంతీ మూవీస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతోంది. కాగా ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ సినిమాను ప్రకటించినప్పటికీ.. ఇటు టాలీవుడ్‌‌తో పాటు అటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ప్రారంభమయ్యాయి. బాహుబలితో అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించుకున్న ప్రభాస్‌.. మహానటితో జాతీయంగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాతో మరో మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తారని అందరూ బలంగా నమ్ముతున్నారు.

ఇదిలా ఉంటే సై ఫై కథాంశంతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని.. నాగ్ అశ్విన్ ఇప్పటికే ఓ ప్రకటన ఇచ్చేశారు. ఇంతవరకు ఇలాంటి కాన్సెఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఏ ఇండస్ట్రీల్లోనూ రాలేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ మూవీ కథకు సంబంధించిన మరో వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీ బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సీక్వెల్‌గా తెరకెక్కనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో ప్రభాస్ 3, 4 పాత్రల్లో కనిపించనున్నారని.. టైమ్ మిషన్ ద్వారా వివిధ కాలాల్లోకి ఆయన వెళ్లనున్నారని.. చాలా భాగాల్లో బాలయ్య నటించిన ఆదిత్య 369ను పోలీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నాగ్ అశ్విన్ ఇలాంటి కథ ఇంతవరకు రాలేదని చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే.. ఈ ప్రాజెక్ట్ ఆదిత్య 396 సీక్వెల్ కాదని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి అసలు ఎలాంటి కాన్సెప్ట్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది..? ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు..? ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: ఎవరైనా పొగిడితే చిరంజీవి ఏం చేస్తారో తెలుసా..!