హైపవర్ కమిటీ అధ్యయనంలో తేలింది ఇదే

| Edited By: Ram Naramaneni

Jan 17, 2020 | 9:08 PM

ఏపీ రాజధాని విషయంలో అధ్యయనం చేసిన కమిటీల నివేదికలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు నియమించిన హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యింది. సుమారు గంట పాటు జరిగిన భేటీలో తాము అధ్యయనం చేసిన అంశాలపై ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హైపవర్ కమిటీ సభ్యులు. శుక్రవారం సాయంత్రం వరకు రైతుల నుంచి, ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చే అవకాశం వుండడంతో ఇంకా తుది నివేదిక రూపకల్పన చేయలేదని కమిటీ సభ్యులు తెలిపారు. […]

హైపవర్ కమిటీ అధ్యయనంలో తేలింది ఇదే
Follow us on

ఏపీ రాజధాని విషయంలో అధ్యయనం చేసిన కమిటీల నివేదికలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు నియమించిన హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యింది. సుమారు గంట పాటు జరిగిన భేటీలో తాము అధ్యయనం చేసిన అంశాలపై ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హైపవర్ కమిటీ సభ్యులు. శుక్రవారం సాయంత్రం వరకు రైతుల నుంచి, ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చే అవకాశం వుండడంతో ఇంకా తుది నివేదిక రూపకల్పన చేయలేదని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే.. జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు నివేదికల్లో పేర్కొన్నట్లుగానే సచివాలయ తరలింపునకే హైపవర్ కమిటీ మొగ్గుచూపినట్లు విశ్వసనీయ సమాచారం. శనివారం మరోసారి హైపవర్ కమిటీ ముఖ్యమంత్రితో భేటీ అవుతుందని తెలుస్తోంది.

దాదాపు 15 రోజుల పాటు అధ్యయనం జరిపిన హై పవర్ కమిటీ.. 29 గ్రామాల్లో సేకరించిన 33 వేల ఎకరాల విషయంలో లోతుగా స్టడీ చేసింది. ల్యాండ్ ఫూలింగ్ ద్వారా ప్రభుత్వానికి చేరిన భూముల్లో ఎన్ని ఎకరాలను వినియోగించారు? ఎంత భూమిని ఇంకా టచ్ చేయలేదు? అనే అంశాలను పరిశీలించారు హై పవర్ కమిటీ సభ్యులు. సీఆర్డీఏ రద్దు విషయాన్ని పరిశీలించిన కమిటీ సభ్యులు.. దాని స్థానంలో విజయవాడ, తెనాలి, గుంటూరు, మంగళగిరి అభివృద్ధి బోర్డును పునరుద్దరించాలని, దాని ద్వారా సీఆర్డీఏ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేసే అంశంపైనే ఎక్కువ ఫోకస్ చేసిన కమిటీ.. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సూచించనున్నట్లు సమాచారం. మొత్తానికి శుక్రవారం సాయంత్రం వరకు వచ్చే సూచనలు, వినతులను పరిగణలోకి తీసుకుని, జనవరి 20 ఉదయం జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికను అందజేయనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం తర్వాత అదే రోజున ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఈ నివేదికను ప్రవేశపెట్టి… దాని సూచనలకు సభ ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.