బిగ్ బాస్: రెచ్చిపోయిన మాజీ లవర్స్.. పెనం‌ పట్టుకుని కొట్లాట!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ మరో అగ్లీ ఫైట్‌కు తెర లేపింది. మాజీ లవర్స్ విశాల్ ఆదిత్య సింగ్, మధురిమ మధ్య పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. హౌస్‌లోకి వచ్చిన తర్వాత వీరిద్దరిలో మార్పు ఉంటుందని అందరూ ఆశించగా.. ఇక్కడ సీన్ కాస్తా రివర్స్ అయింది. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సిట్యువేషన్ ఏర్పడింది. రీసెంట్‌గా వీరిద్దరూ గొడవ పడిన తీరు.. అటు ప్రేక్షకులు.. ఇటు నిర్వాహకుల సహనానికి పరీక్ష […]

బిగ్ బాస్: రెచ్చిపోయిన మాజీ లవర్స్.. పెనం‌ పట్టుకుని కొట్లాట!
Follow us

|

Updated on: Jan 17, 2020 | 2:01 PM

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ మరో అగ్లీ ఫైట్‌కు తెర లేపింది. మాజీ లవర్స్ విశాల్ ఆదిత్య సింగ్, మధురిమ మధ్య పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. హౌస్‌లోకి వచ్చిన తర్వాత వీరిద్దరిలో మార్పు ఉంటుందని అందరూ ఆశించగా.. ఇక్కడ సీన్ కాస్తా రివర్స్ అయింది. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సిట్యువేషన్ ఏర్పడింది.

రీసెంట్‌గా వీరిద్దరూ గొడవ పడిన తీరు.. అటు ప్రేక్షకులు.. ఇటు నిర్వాహకుల సహనానికి పరీక్ష పెట్టిందనే చెప్పాలి. ఇద్దరి మధ్యా గొడవ అంతకంతకూ తారాస్థాయికి చేరుకోవడంతో బిగ్ బాస్ ఆ జంటను జైలు‌లో బంధించి.. వారం చివర్లో ఈ తతంగంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు. ఇక దీనికి పనిష్మెంట్‌గా మధురిమను ఈ వీకెండ్‌లో సల్మాన్ ఖాన్ ఇంటి నుంచి బయటికి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే..

గార్డెన్ ఏరియాలో ఉన్న రష్మీ దేశాయ్ విశాల్‌ను టీ చేయమంటుంది. ఇక అక్కడే ఉన్న మధురిమ కూడా తనకూ కావాలని అడుగుతుంది. అయితే విశాల్ మాత్రం తాను రష్మీకి మాత్రమే చేస్తానని గట్టిగా చెబుతాడు. దీనికి కోపం తెచ్చుకున్న ఆమె.. అతడిని ‘బెహెన్‌జీ.. బెహెన్‌జీ’ అంటూ ఏడిపించడం మొదలుపెడుతుంది. దేనికైనా సరే ఒక హద్దు ఉంటుంది కదా.. ఆమె దాన్ని కూడా దాటేయడంతో విశాల్ కోపంతో ఆమెపై నీళ్లు పోస్తాడు. మధురిమ కూడా గొడవని పొడిగిస్తూ అతని యాక్షన్‌కు సరైన రియాక్షన్ ఇస్తుంది. ఇలా ఇద్దరి ఫైటింగ్ కొనసాగుతుండగా.. బిగ్ బాస్ వీళ్లిద్దరికి వార్నింగ్ ఇస్తాడు.

ఈ జంట దాన్ని సైతం బేఖాతరు చేస్తుంది. అయితే ఒకానొక సందర్భంలో విశాల్ సైలెంట్ అయిపోగా.. మధురిమ మాత్రం అతనిపైకి పెనం తీసుకుని వెళ్లి మరీ.. కొట్టడం ఆరంభిస్తుంది. దానికి అతడు ఏమి మాట్లాడకుండా దెబ్బలు భరిస్తూనే ఉంటాడు. ఇక ఈ గొడవ తారాస్థాయికి చేరుతుండటంతో.. మిగతా కంటెస్టెంట్లు రష్మీ దేశాయ్, ఆర్తి సింగ్, పరాస్, సిద్ధార్థ్, షెఫాలీలు వచ్చి మధురిమను అడ్డుకుంటారు. అంతేకాకుండా ఆమె విశాల్‌ను కొట్టిన ప్యాన్ వంగిపోయి.. విరిగిపోవడాన్ని కూడా గమనిస్తారు.

కాగా, ఈ జంట మధ్య ఇది మొదటి గొడవ కాదు.. హౌస్‌లోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సార్లు కొట్టుకుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న చిన్న విషయానికి ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఏది ఏమైనా హిందీ బిగ్ బాస్ మరో లెవెల్‌కు చేరుకుందని చెప్పాలి. ముద్దులు, రొమాన్స్, గొడవలు ఇలా అన్నింటిలోనూ పీక్స్‌కు వెళ్ళిపోయింది. త్వరలోనే తెలుగులో మొదలయ్యే నాలుగో సీజన్‌లో ఇలాంటి సన్నివేశాలు రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..