సామాన్యుడికి మిర్చి ఘాటు..రైతుకేమో అదిరే రేటు..!

నిన్నమొన్నటి వరకు ఉల్లిఘాటు ప్రజలకు చుక్కలు చూపించింది. తాజాగా ఉల్లి వరుసలోనే వంటనూనెలు మంటపుట్టిస్తున్నాయి. ఇప్పుడు ఘాటెక్కిన మిర్చితో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆశించిన ధరలతో రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా క్వింటాలు తేజ మిర్చి 18 వేల 500, యూఎస్ 341 రకం 14,500 రికార్డ్ ధర నమోదైంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలోనే పెద్ద మార్కెట్. నిత్యం వేలాది మంది రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులు […]

సామాన్యుడికి మిర్చి ఘాటు..రైతుకేమో అదిరే రేటు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 24, 2019 | 3:40 PM

నిన్నమొన్నటి వరకు ఉల్లిఘాటు ప్రజలకు చుక్కలు చూపించింది. తాజాగా ఉల్లి వరుసలోనే వంటనూనెలు మంటపుట్టిస్తున్నాయి. ఇప్పుడు ఘాటెక్కిన మిర్చితో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆశించిన ధరలతో రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా క్వింటాలు తేజ మిర్చి 18 వేల 500, యూఎస్ 341 రకం 14,500 రికార్డ్ ధర నమోదైంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలోనే పెద్ద మార్కెట్. నిత్యం వేలాది మంది రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులు విక్రయించేందుకు ఇక్కడికే వస్తుంటారు. ఈ యేడు సీజన్ ప్రారంభంలోనే అన్నదాతకు మంచి ధర లభిస్తున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్ చరిత్రలో లేనివిధంగా తేజ రకం మిర్చి క్వింటాలుకు రూ. 18 వేల 500 నమోదయింది. అదేవిధంగా యూఎస్ 341 రకం మిర్చికి రూ. 14 వేల 500 రూపాయలు నమోదైంది. ఈ సంవత్సరం అధిక వర్షాలకు కొంత పంటలు దెబ్బతిన్నాయని అన్ని బాగుంటే ఎకరాకు కనీసం 30 క్వింటాల్‌ మిర్చి దిగుబడి వచ్చేదిని,  కానీ ప్రస్తుతం ఎకరాకు 20 నుండి 25 క్వింటాల్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.
మార్కెట్లో ధరలు చూస్తే రైతుకు గిట్టుబాటుగా ఉన్నాయి..కానీ, రైతు వద్ద ఉన్న మిర్చి పూర్తిగా అమ్ముకునేంత వరకు ఈ ధరలే ఉంటే ఈసారి  మంచి లాభాలు ఉంటాయని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం మిర్చికి మంచి ధర లభిస్తుందని,  రైతులు మార్కెట్‌కు వచ్చేముందే రేట్లపై అవగాహనతో రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ తక్కువ ధరలు ఉన్నట్లయితే, కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరుచుకుని గిట్టుబాటు ధర ఉన్నప్పుడే అమ్ముకోవాలని రైతులకు సూచిస్తున్నారు. అవసరమైతే రైతులకు రూ. 2 లక్ష రూపాయల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు మార్కెట్ కమిటీ సిద్ధంగా ఉందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కార్యదర్శి సంగయ్య తెలిపారు.

డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం