2019లో రాత్రికి రాత్రే స్టార్స్‌గా అవతారం! మీరూ ఓ లుక్కేసేయండి!

2019‌లో చాలా వీడియోలు మనకు మాటలు లేకుండా చేశాయి. ఇదేం విచిత్రం రా బాబు అనేంతగా.. కొన్ని వీడియోలు ఆశ్యర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా రామ రామ అంటూ వృద్ధ్యాప్యంలో జీవితం గడిపే వయసులో కూడా ఇలా పాడొచ్చా అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన రాను మొండల్ గానం 2019లో సంచలనంగా మారింది. అలాగే.. అభినందన్ వర్థమాన్ నుంచి 85 లక్షల రూపాయల విలువైన అరటిపండు తినడం వరకు 2019 టాప్ 10 విడియోల లిస్ట్ […]

2019లో రాత్రికి రాత్రే స్టార్స్‌గా అవతారం! మీరూ ఓ లుక్కేసేయండి!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 24, 2019 | 4:18 PM

2019‌లో చాలా వీడియోలు మనకు మాటలు లేకుండా చేశాయి. ఇదేం విచిత్రం రా బాబు అనేంతగా.. కొన్ని వీడియోలు ఆశ్యర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా రామ రామ అంటూ వృద్ధ్యాప్యంలో జీవితం గడిపే వయసులో కూడా ఇలా పాడొచ్చా అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన రాను మొండల్ గానం 2019లో సంచలనంగా మారింది. అలాగే.. అభినందన్ వర్థమాన్ నుంచి 85 లక్షల రూపాయల విలువైన అరటిపండు తినడం వరకు 2019 టాప్ 10 విడియోల లిస్ట్ మీ కోసం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేసేయండి!

1. అభినందన్ వర్థమాన్:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. ఇతడు నిలువెత్తు పరాక్రమానికి, ధైర్యసాహసాలకు నిదర్శనం. బాలకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం గగనతలంలో జరిగిన పోరులో పాక్ ఎఫ్ -16 విమానాన్ని అభినందన్ తన మిగ్ -21 బైసన్ యుద్ధ విమానంతో కూల్చేశారు. అనంతరం అనుకోకుండా పాకిస్థాన్‌కు చిక్కాడు. దాయాది చేతిలో చిత్రహింసలు అనుభవించాడు. చివరకు భారత ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడికి తలొగ్గి రెండు రోజుల తర్వాత అతడిని మన దేశానికి అప్పగించింది పాక్ ప్రభుత్వం. ఇందుకుగానూ కేంద్రం ఆయనకు వీరచక్ర పురస్కారం ఇచ్చి గౌరవించింది కూడా.

2. రాను మొండల్:

సోషల్ మీడియాలో.. ఓ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎవరో గుర్తు తెలియని మహిళ గానం చేసిన ఓ పాట ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. గాన కోకిల లతా మంగేష్కర్ క్లాసిక్ “ఏక్ ప్యార్ నగ్మా హై”ను సేమ్ టు సేమ్ అలాగే గానం చేసి తన తియ్యని గొంతుతో కట్టిపడేసింది. పశ్చిమబెంగాల్ రన్‌ఘాట్ రైల్వే స్టేషన్‌లో ఆమె పాడుతున్న సమయంలో ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో చూసిన ఎంతో మంది ఈమె ఎవరు, ఎక్కడుంటుంది? అనే ప్రశ్నలతో సతమతమయ్యారు. ఈ వీడియోను “బార్‌పేట టౌన్” అనే ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయడంతో అది ఏకంగా నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో అచ్చం లతా మంగేష్కర్‌లా గానం చేస్తున్న ఈమెను రాను మొండల్‌గా గుర్తించారు. ఇప్పుడు ఈమె గాత్రం కోసం ఎంతోమంది క్యూ కడుతున్నారు.

3. విపున్ సాహు:

విపున్ సాహు అకా పారాగ్లైడింగ్ వ్యక్తి. కులులో గ్లైడింగ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయ్యాడు. అతను ఒక సంచలనం అయిపోయాడు. వీడియోలోని సారాంశాలు ఇప్పటికీ మీమ్స్ గా ఉపయోగించబడుతున్నాయి. “యార్ రూ .500 లేలే, బాస్ ల్యాండ్ కరాడే” అనేది వీడియో నుండి ప్రసిద్ధి చెందిన ఒక క్షణం.

4. రూపాయికే ఇడ్లీ బామ్మ:

రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తూ.. పేదల కడుపు నింపుతున్న ఆ బామ్మ మీకు తెలిసే ఉంటుంది కదా. తమిళనాడుకు చెందిన కమలాథల్ కట్టెల పొయ్యి మీద 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకేముంది దేశవ్యాప్తంగా ఈమె పేరు మారు మ్రోగిపోయింది. అంతేకాదు ఆమె కష్టం తెలిసి చలించిపోయిన ఆనంద్ మహీంద్రా ఆమెకు గ్యాస్ పొయ్యి కూడా కొనిచ్చాడు.

5. స్కూల్ ప్రిన్సిపాల్:

చైనాలోని జి గ్వాన్ ప్రైమరీ స్కూల్లో.. ఒక పాఠశాల ప్రిన్సిపాల్ డ్యాన్స్ చేసిన నెట్టింట్లో ఫుల్‌గా వైరల్ అయ్యింది. పాఠశాల పిల్లలు వారి రోజువారీ వ్యాయామంలో భాగంగా ఎంతో కామెడీగా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఓ ఆహ్లాదకరమైన పాటతో వారికి వ్యాయం చేపించాడు. అప్పట్లో ఇది బాగా వైరల్ అయింది.

https://www.facebook.com/scmp/videos/829695274039883/?t=0

6. అక్షయ్ కుమార్ బాటిల్ క్యాప్ ఛాలెంజ్:

రోజుకో కొత్త ఛాలెంజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుందన్న విషయం తెలిసిందే కదా. అందులో భాగంగానే.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చేసిన బాటిల్ క్యాప్ ఛాలెంజ్ వైరల్ గా మారింది. చేతితో తీయకుండా బాటిల్ క్యాప్‌ను ఎలా తీస్తారు..? ఇదే ఆ ఛాలెంజ్ ఉద్దేశం. దీనిని స్వీకరిస్తూ అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా, సుధీర్ బాబు, కార్తికేయ, రితేష్ దేశ్‌ముఖ్, పరిణీతి చోప్రా వంటి వారు కాలితో తమ స్టైల్‌లో బాటిల్‌ మూతను తీశారు.

https://www.instagram.com/p/BzcTHSpHHhq/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

7. రూ.85 లక్షల అరటి పండు హాంఫట్:

న్యూయార్క్ నగరానికి చెందిన పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్, డేవిడ్ డాటునా గోడ నుండి టేప్ చేసిన అరటిపండును ఒలిచి, దానిని తినేశాడు. ఓ వ్యక్తి గోడకు అంటించిన అరటిపండును అక్షరాల 85లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించాడు. దీనికి ‘కమెడియన్’ అని నామకరణం చేశాడు. మూడు అరటి పండ్లను ఈ విధంగా ప్రదర్శించగా.. వాటిలో రెండు అమ్ముడుపోయాయి. ఈ అరటి పండు ఉదంతాన్ని ఆర్ట్ బాసెల్ మియామీ బీచ్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. అయితే ఇప్పుడు అంత ఖరీదైన అరటి పండు తినడం వైరల్ అయ్యింది.

8. చిట్టి చెల్లెలకి ఫ్రైడ్ రైస్‌!

తన చిట్టి చెల్లెలు ఆకలిని గమనించిన ఓ బుడ్డోడు తానే అమ్మగా మారిపోయాడు. పెద్ద గరిట సైజ్‌ కూడా లేని ఆ పిల్లాడు తన చేతికి సరిపోయే గరిటను పట్టి ప్రొఫెషనల్ చెఫ్‌గా మారి అద్భుతమైన ఫ్రైడ్ రైస్ చేశాడు. ఆ తరువాత తానే సొంతంగా తన చెల్లికి తినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

9. ఆనంద్ మహీంద్రా సోల్డర్స్ వీడియో:

నిత్యం ఆనంద్ మహీంద్రా ఏదో ఒక వైరల్ కంటెంట్ మీద ట్వీట్స్ చేస్తూనే ఉంటారు. అందులో ఒకటి సోల్జర్స్ డ్యాన్స్ చేసిన వీడియో. ఆ వీడియోలో వారు ఎంతో ఆనందంగా గార్భా డ్యాన్స్ వేస్తూ కనిపించారు. వారికి కుదిరిన ఖాళీ సమయంలో వారు నృత్యం చేస్తుండగా అక్కడొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో.. ఇది కాస్తా వైరల్‌గా మారింది.

10. కొహ్లీనే కానీ కొహ్లీ కాదు:

కొహ్లీనే కానీ కొహ్లీ కాదు అందేటి..? ఇతన్ని చూస్తే అచ్చం కొహ్లీగానే ఉన్నాడు కదా! అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే! నిజానికి ఇతని పేరు గౌరవ్ అరోరా. ఇతనిలో ఎలాంటి ప్రతిభా లేకపోయినా టిక్‌టాక్‌లో బాగా ప్రాచుర్యం పొందాడు. అందులోనూ.. కొహ్లీ లుక్ ఉండటంతో.. ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాడు. కొహ్లీ హావభావాలతో.. స్లైల్‌‌ను అనుకరిస్తూ ఏకంగా 4 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. దీంతో.. అతను దేశవ్యాప్తంగా వైరల్‌గా మారాడు.

పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే