AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam : శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డ్ స్థాయిలో ఆదాయం.. నెల రోజుల్లో రూ. 7.19 కోట్లు!

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. ఉగాది మహోత్సవాలలో కన్నడ, మహారాష్ట్ర భక్తులతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో స్వామివారికి ఏకంగా రూ. 7 కోట్ల 19 లక్షల 58 వేల 064 ఆదాయం వచ్చింది.

Srisailam : శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డ్ స్థాయిలో ఆదాయం.. నెల రోజుల్లో రూ. 7.19 కోట్లు!
Srisailam Hundi Income
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Mar 22, 2026 | 1:34 PM

Share

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. ఉగాది సందర్భంగా ఏకంగా స్వామివారికి రూ.7కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. మొత్తం 30 రోజులలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు భారీ మొత్తం కానుకలు సమర్పించుకున్నారు. ఇక నెల రోజులు ముగియడంలో నేడు ఉభయ, పరివార ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయ అధికారులు. అక్కమహాదేవి అలంకారం మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 7 కోట్ల 19 లక్షల 58 వేల 064 రూపాయల నగదు కానుకల రూపంలో వచ్చిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

నగదుతో పాటు 122 గ్రాముల 200 మిల్లి గ్రాములు బంగారం, 6 కేజీల 550 గ్రాములు వెండిని సమర్పించారని ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే 624 యుఎస్ఏ డాలర్లు, 210 UAE దిర్హమ్స్, 6 సౌదీరియాల్స్, 10 సింగపూర్ డాలర్లు, 20 ఇంగ్లాండు పౌండ్స్, 14 మలేషియా రింగిట్స్ , 25 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూరోలు, 1 కువైట్ దినార్, 60 కెనడా డాలర్లు,  20 న్యూజిలాండ్ డాలర్లు వచ్చాయన్నారు.

వీడియో చూడండి..

పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ సభ్యుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us