ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో జామ చాలా ముఖ్యమైనది. అయితే అన్ని పండ్లూ అందరూ తినవచ్చు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వీటికి దూరంగా ఉండాలి
TV9 Telugu
జామపండులో విటమిన్ సి, పొటాషియం, శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో ముందుంటుంది
TV9 Telugu
చర్మ సంరక్షణలోనూ, మలబద్ధకాన్ని నివారించడంలోనూ దివ్యౌషధమే. అయితే ఎన్ని లాభాలు ఉన్నప్పటికీ కొందరు ఈ పండుకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
జామలోని కొన్ని బయోయాక్టివ్ సమ్మేళనాలు అలెర్జీని కలిగిస్తాయి. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవాళ్లలో దురద, మంట, చర్మం ఎర్రబడటం లాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి చర్మ సమస్యలు ఉన్నవారు జామ పండును తినేముందు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవాలి
TV9 Telugu
అలాగే నిద్రపోయే ముందు జామపండు తినడం మంచిదికాదట. ఎందుకంటే ఈ పండ్లలో ఫ్రక్టోజ్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం కలిగే అవకాశం ఉంటుంది
TV9 Telugu
ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు జామపండ్లను తినకపోవడమే మంచిది. జామపండు గింజల్లో ఆక్సలేట్లు ఉంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఇవి మరింత ఇబ్బంది కలిగిస్తాయి
TV9 Telugu
కాబట్టి వారు జామపండ్లను ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తిన్నా, గింజలు లేకుండా తీసుకోవాలి. జామపండ్లలో లభించే అధిక ఫైబర్.. కొందరికి చికాకును కలిగిస్తుంది
TV9 Telugu
కడుపు తిమ్మిరి, విరేచనాలు, అధిక అపానవాయువు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి, జీర్ణ సమస్యలు ఉంటే, జామపండును తొక్క తీసి తినడం అలవాటు చేసుకోవాలి