ఫొని ఎఫెక్ట్ : తమిళనాడుకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాన్ ఉత్తర తమిళనాడు దిశగా ముంచుకొస్తుంది. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుండగా.. ఈనెల 30న ఉత్తర తమిళనాడు దిశగా రానుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన దిశమార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుంది. దీని ప్రభావంతో మే 1 తర్వాత పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం […]
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాన్ ఉత్తర తమిళనాడు దిశగా ముంచుకొస్తుంది. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుండగా.. ఈనెల 30న ఉత్తర తమిళనాడు దిశగా రానుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన దిశమార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుంది. దీని ప్రభావంతో మే 1 తర్వాత పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్య కారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇప్పటికే ఏపీలో అన్ని ప్రధాన పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరికలు జారీచేయగా తమిళనాడు అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు.