రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. తెలంగాణలో నిన్న ఒక్క రోజే పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటగా, కరోనా వల్ల ఆరుగురు మృతి చెందారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 796 కొత్త కరోనా కేసులు, 11 మరణాలు సంభవించాయి.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 1,087 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 888 కేసులను గుర్తించగా, తర్వాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉన్నట్లు ప్రకటించారు. ఇక్కడ మొత్తం 74 కరోనా కేసులను గుర్తించారు. తర్వాతి స్థానాల్లో మేడ్చల్ (37), నల్గొండ (35), సంగారెడ్డి (11), కామారెడ్డి (5), కరీంనగర్ (5), సిరిసిల్ల (3), సిద్ధిపేట (2), వరంగల్ అర్బన్ (7), మహబూబ్‌నగర్ (5), ఆసిఫాబాద్, ఖమ్మం, వనపర్తి, మహబూబాబాద్, మంచిర్యాలలో ఒక్కో కేసు చొప్పున నమోదు కాగా, నాగర్‌కర్నూలు, జనగాంలలో 4 చొప్పున కేసులు, భద్రాద్రి కొత్తగూడెంలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,436కి చేరగా.. కరోనా వల్ల ఇప్పటివరకు 243 మంది మృతి చెందారు.
అటు ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. శనివారం ఒక్కరోజే 796 కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా 11 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,285కి చేరింది. అటు ఇప్పటివరకు 157 మంది కరోనాతో చనిపోయారు. శనివారం అనంతపురం 161, చిత్తూరు 84, ఈస్ట్ గోదావరి 109, గుంటూరు 71, కడప 50, కృష్ణ 53, కర్నూలు 69, నెల్లూరు 24, ప్రకాశం 26, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 34, విజయనగరం 15, వెస్ట్ గోదావరిలో 44 కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకు అత్యధికంగా కర్నూలులో 1684 కేసులు నమోదు కాగా, కృష్ణాలో 53 కరోనా మరణాలు సంభవించాయి.
Read This: ప్రైవేట్ స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్…