డబుల్ మాల్ట్.. డబుల్ శక్తి.. ఉదయాన్నే ఏ టిఫిన్ కూడా తినక్కర్లేదు.. ఇది కొంచెం తాగితే చాలు
రాగి, జొన్న జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గించి, నీరసాన్ని దూరం చేస్తుంది. ప్రతిరోజు ఈ జావ తాగడం వల్ల ఎముకలు ఉక్కులా మారతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ పోషకమైన జావ రెసిపీ గురించి ఈ కథనంలో తెలుసుకోండి.

ఎండాకాలంలో బాడీ కూల్ గా ఉండేందుకు కొన్ని పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది.. అలాంటి పదార్థాల్లో అత్యంత పోషకకరమైన జొన్నలు, రాగులతో తయారు చేసిన జావ ఒక సంపూర్ణ ఆరోగ్య పానీయం తీసుకోవడం చాలా మంచిది. జొన్న, రాగి జావ శరీరంలోని వేడిని సమర్థవంతంగా తగ్గించి, నీరసాన్ని దూరం చేసి, రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తిని అందిస్తుంది. దీనిని ప్రతిరోజు తాగడం వల్ల ఎముకలు ఉక్కులా బలపడతాయని, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రుచికరమైన, పోషకమైన రాగి జొన్న జావను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
రాగి జొన్న కావాల్సిన పదార్థాలు:
జొన్నలు: అర కప్పు
రాగి పిండి: అర కప్పు
సాల్ట్: రుచికి సరిపడా
నీళ్లు: నాలుగు గ్లాసులు (ఒకటిన్నర లీటరు సుమారు)
తయారీ విధానం:
జొన్న, రాగి పిండిని… ఓ గిన్నెలో ముద్దలు ముద్దలు లేకుండా.. కలుపుకోవాలి..
ముందుగా ఒక పెద్ద గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకొని, మంటను హై లో పెట్టి బాగా మరిగించాలి. నీళ్లు తెర్లుతున్నప్పుడు తదుపరి దశకు సిద్ధం కావాలి.
అనంతరం.. మంటను మీడియంకు తగ్గించి, గరిటెతో తిప్పుతూ జొన్న రాగి మిశ్రమాన్ని వేసి ఉడికించాలి. అడుగంటకుండా, చక్కగా ఉడకడానికి నిరంతరం కలుపుతూ ఉండడం ముఖ్యం.
ఆ తర్వాత రుచికి సరిపడా వేయాలి.. జావను రెండు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడకనివ్వాలి.
ఒకవేళ జావ మరీ చిక్కగా అనిపిస్తే, అవసరమైన మేరకు కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు.
జావ చక్కగా ఉడికి, అన్ని పదార్థాలు కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఆ తర్వాత.. రుచికోసం ఉల్లిపాయ తురుము.. పచ్చి మిర్చి వేసుకోవచ్చు. ఇంకా మజ్జిగ, పెరుగు కూడా కలుపుకోవచ్చు.
ఈ వేడి వేడి రాగి జొన్న జావను ఉదయం లేదా సాయంత్రం సేవించవచ్చు. ఇది శరీరానికి బలాన్ని, ఆరోగ్యంతో పాటు సంపూర్ణమైన పోషణను అందిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
