Raghuram Rajan: అదొక గాలి బుడగ, దానికి నిజమైన విలువ లేదు… బిట్‌ కాయిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజన్‌..

Raghuram Rajan About Bit Coin: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బిట్‌ కాయిన్‌ విలువ పెరిగిపోతోంది. గతేడాది 10 వేల డాలర్లున్న బిట్‌ కాయిన్‌ విలువ నేడు 40 వేల డాలర్లకు చేరింది. దీంతో..

Raghuram Rajan: అదొక గాలి బుడగ, దానికి నిజమైన విలువ లేదు... బిట్‌ కాయిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజన్‌..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 5:43 AM

Raghuram Rajan About Bit Coin: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బిట్‌ కాయిన్‌ విలువ పెరిగిపోతోంది. గతేడాది 10 వేల డాలర్లున్న బిట్‌ కాయిన్‌ విలువ నేడు 40 వేల డాలర్లకు చేరింది. దీంతో బిట్‌ కాయిన్‌పై పెట్టబడి పెట్టేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఇది కేవలం గాలి బుడగ లాటిందని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రఘురామ్‌ రాజన్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘వ‌ర్చువ‌ల్ మ‌నీ.. బిట్ కాయిన్‌.. ఒక క్లాసిక్ బ‌బుల్ (బుడ‌గ‌). గ‌తేడాది 10 వేల డాల‌ర్లున్న బిట్ కాయిన్ విలువ ఈనాడు 40 వేల డాల‌ర్లు దాటింది. బిట్‌ కాయిన్‌ ఒక గాలి బుడగలాంటిది, దీనికి నిజ‌మైన విలువ లేదు. ఇది ఒక ఆస్తిగా ప‌రిగ‌ణించినా చెల్లింపులు జ‌రుప‌డం క‌ష్టం’ అని చెప్పుకొచ్చారు. ఇక స్టాక్‌ మార్కెట్లు శరవేగంగా దూసుకెళ్లడంపైన స్పందించిన రఘురామ్‌ రాజన్‌.. ‘స్టాక్‌ మార్కెట్లు కీలకమైన 50 వేల మార్కును కూడా దాటిపోవచ్చు. దీనికి ఐటీ దిగ్గ‌జ సంస్థ ఇన్ఫోసిస్‌, విప్రో ఆర్థిక ఫ‌లితాలే కార‌ణం’ అని తెలిపారు.

Also Read: UPI Payments: యూపీఐ, రూపే కార్డ్‌ లావాదేవీలకు చార్జీలు వసూలు చేస్తుండడంపై రంగంలోకి దిగిన సీబీడీటీ.. వివరణ ఇవ్వాలంటూ..