కరోనా వారియర్స్: వారికి ఉచితంగా లక్ష విమాన టికెట్లు..

కరోనా వారియర్స్: వారికి ఉచితంగా లక్ష విమాన టికెట్లు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కరోనాపై పోరులో ముందువరుసలో ఉండి సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి

TV9 Telugu Digital Desk

| Edited By:

May 14, 2020 | 12:09 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కరోనాపై పోరులో ముందువరుసలో ఉండి సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి లక్ష తిరుగు ప్రయాణ విమాన టికెట్లను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రకటన చేసింది.

కాగా.. ఈ ఆఫర్‌ను పొందేందుకు ఆరోగ్య సిబ్బంది తమ వెబ్‌సైట్‌లో వారి వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ మే 18 అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమేనని తెలిపింది. ముందుగా వివరాలను నమోదు చేసుకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. అన్ని దేశాలకు చెందిన ఆరోగ్య సిబ్బందికి ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది.

మరోవైపు.. “ఆరోగ్య సిబ్బందికి ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కృతజ్ఞతలు తెలుపుతోంది. వారి నిర్విరామ కృషి వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగారు. వారికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలిపినా సరిపోదు. మా వంతుగా వారికి తిరుగు ప్రయాణ టిక్కెట్లను అందివ్వాలని నిర్ణయించాం. విమాన ప్రయాణాలపై ఆంక్షలు సడలించిన తర్వాత ఆరోగ్య సిబ్బంది ఏ ప్రదేశానికి వెళ్లినా వారి తిరుగు ప్రయాణ టికెట్టును ఖతార్‌ ఎయిర్‌వేస్‌ వారికి ఉచితంగా అందిస్తాం” అని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ గ్రూప్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు.

[svt-event date=”14/05/2020,12:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also read: కరోనా చికిత్సలో కీలకంగా ‘రెమ్డిసివిర్‌’.. ఇక హైదరాబాద్‌లో తయారీ..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu