రష్యాలో కరోనా మరణాలు తక్కువేనట ! మర్మమేమిటో మరి ?

రష్యాలో కరోనా మరణాలు తక్కువేనట ! మర్మమేమిటో మరి ?

అమెరికా, స్పెయిన్ వంటి దేశాల్లో మాదిరే రష్యాలో కూడా కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. యుఎస్ తరువాత ఈ దేశం గ్లోబల్ ఎపిడమిక్ హాట్ స్పాట్ గా మారింది. కానీ ఇతర దేశాలతో పోలిస్తే ఈ దేశంలో మరణాల రేటు తక్కువగా ఉండడం ఆరోగ్య నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది.

Umakanth Rao

| Edited By: Anil kumar poka

May 14, 2020 | 12:57 PM

అమెరికా, స్పెయిన్ వంటి దేశాల్లో మాదిరే రష్యాలో కూడా కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. యుఎస్ తరువాత ఈ దేశం గ్లోబల్ ఎపిడమిక్ హాట్ స్పాట్ గా మారింది. కానీ ఇతర దేశాలతో పోలిస్తే ఈ దేశంలో మరణాల రేటు తక్కువగా ఉండడం ఆరోగ్య నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. కరోనా డెత్ కేసుల్ని ఎందుకింత తక్కువగా చూపుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. రష్యాలో 242,271 కంఫామ్డ్ కేసులు నమోదు కాగా.. ఈ వైరస్ ఇక్కడ అడుగు పెటినప్పటినుంచి 2,212 మంది రోగులు మాత్రమే మరణించారని అధికారులు చెబుతున్నారు. అదే స్పెయిన్ దేశంలో సుమారు 27 వేల మంది మృతి చెందారు. బ్రిటన్, ఇటలీ దేశాల్లో రష్యా కన్నా 12 రెట్లు ఎక్కువగా మరణాల రేటు నమోదయింది.

కరోనా డెత్ కేసుల విషయమై తాము రష్యా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గ్లోబల్ ఏవరేజిలో ఇది అతి  తక్కువగా…. అంటే 0.9 శాతం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ దేశ అధికారులతో కూడా తాము మాట్లాడుతున్నామని, రోగుల మరణాల విషయంలో ఏదైనా మిస్ అయ్యారా అన్న విషయాన్ని తెలుసుకోగోరుతున్నామని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి మెలిటా ఉజ్నవిక్ చెప్పారు. ఏమైనా రష్యాలోని కరోనా మరణాల రేటు ఎక్కువే ఉండవచ్చునని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి అంటోంది. అటు-మరణాల సంఖ్యను తాము తక్కువగా చూపుతున్నట్టు వస్తున్న విమర్శలను రష్యా డెప్యూటీ పీఎం తాత్యానా గొలికోవా ఖండించారు. అఫీషియల్ డేటాను మేమేమీతక్కువ చేసి చూపడం లేదన్నారు. ఈ నెల 3 నుంచి ఈ దేశంలో రోజుకు సుమారు పది వేల  కరోనా కేసులు నమోదు అవుతున్నా,, డెత్ రేట్స్ మాత్రం ‘యాజ్ ఇటీజ్’ గా ఉండడం ఆశ్చర్యకరం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu