బెడ్‌పై కొండచిలువ..బ్రతికాను చాలురా దేవుడా!

బెడ్‌పై కొండచిలువ..బ్రతికాను చాలురా దేవుడా!
Australian family finds snake chilling on bed

రోజంతా పనిచేసి అలసిపోయిన వాళ్లు బయట ఏదో ఒకటి తినేసి సాయంత్రం త్వరగా వెళ్లి పడుకుంటారు. అయితే ఈ సారి నుంచి స్లీప్‌కి వెళ్లేముందు కాస్త దుప్పట్లు అవీ నీట్‌గా సర్దుకోండి..బెడ్‌పైన, క్రింద ఓ సారి చెక్ చేసుకోండి. ఎందుకు ఇన్ని జాగ్రత్తులు చెబుతున్నాం అనుకుంటున్నారా?. అయితే మీరు ఈ ఇన్సిండెంట్ తెలుసుకోవాల్సిందే. బాగా అలిసిపోయిన ఓ వ్యక్తి .. ఇంటికొచ్చి బెడ్ ఎక్కేశాడు. స్లోగా నిద్రలోకి జారుకుంటున్న సమయంలో క్రింద ఏదో పాకుతున్నట్టు అనిపించింది.  హా..లైట్‌ […]

Ram Naramaneni

| Edited By: Srinu Perla

Aug 23, 2019 | 4:43 PM

రోజంతా పనిచేసి అలసిపోయిన వాళ్లు బయట ఏదో ఒకటి తినేసి సాయంత్రం త్వరగా వెళ్లి పడుకుంటారు. అయితే ఈ సారి నుంచి స్లీప్‌కి వెళ్లేముందు కాస్త దుప్పట్లు అవీ నీట్‌గా సర్దుకోండి..బెడ్‌పైన, క్రింద ఓ సారి చెక్ చేసుకోండి. ఎందుకు ఇన్ని జాగ్రత్తులు చెబుతున్నాం అనుకుంటున్నారా?. అయితే మీరు ఈ ఇన్సిండెంట్ తెలుసుకోవాల్సిందే.

బాగా అలిసిపోయిన ఓ వ్యక్తి .. ఇంటికొచ్చి బెడ్ ఎక్కేశాడు. స్లోగా నిద్రలోకి జారుకుంటున్న సమయంలో క్రింద ఏదో పాకుతున్నట్టు అనిపించింది.  హా..లైట్‌ లే అని ఫుల్‌గా దుప్పట్టి కప్పేశాడు. మళ్లీ అలానే అనిపించడంతో… ఒక్కసారి లైట్ వేసి చూస్తే. పేద్ద పాము. అలాంటి ఇలాంటి పాము కూడా కాదు ఏకంగా మింగేసే కొండచిలువ. ఒక్కసారిగా భయపడ్డ ఆ వ్యక్తి అక్కడి నుంచి పరుగు లఖించుకున్నాడు.  ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్‌లో ఈ హారిబుల్ ఇన్సిడెంట్ చోటచేసుకుంది.  వెంటనే స్కేక్ క్యాచర్ అసోసియేషన్‌కు ఫోన్ చేశాడు. వాళ్ల వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. ఇంతకీ ఎలా వచ్చిందో అని ఇంటిని పరికిస్తే బెడ్రూమ్‌కి ఉన్న సీలింగ్‌కి హోల్ ఉంది. దాన్నుంచి వచ్చి వుంటుందని అంచనా వేశారు. ఆ ఇంటి ఓనర్ మాత్రం బ్రతికున్నాను చాలురా దేవుడా అంటూ ఇంకా షాక్‌లోనే ఉన్నాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu