AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూరీ చెప్పిన మాట విందామా.. బ్యాక్టీరియా తినే దాన్నే మనమూ తిందామా

పూరీ సినిమాల్లోని పంచ్ డైలాగ్ లు యూత్ ఎంతో ఇష్టం. ఇక ఇప్పుడు ఆయన `పూరీ మ్యూజింగ్స్` పేరుతో ఎన్నో విషయాలు చెబుతూనే ఉన్నారు. సూటిగా సుత్తిలేకుండా ఆయన చెప్పే మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందుకే పూరీ మ్యూజింగ్స్ మంచి క్రేజ్ ఉంది.

పూరీ చెప్పిన మాట విందామా.. బ్యాక్టీరియా తినే దాన్నే మనమూ తిందామా
Anil kumar poka
|

Updated on: Dec 07, 2020 | 8:34 PM

Share

డైరెక్టర్ పూరీజగన్నాథ్ చెప్పే మాటల్లో మనకు ఏదో తెలియని విషయం ఉంటుంది. ఆయన మాటలకి జనాల్లో క్రేజ్ బాగానే ఉంది. ఏ విషయాన్ని అయినా బోల్డ్ గా చెప్పగలరు ఆయన. పూరీ సినిమాల్లోని పంచ్ డైలాగ్ లు యూత్ ఎంతో ఇష్టం. ఇక ఇప్పుడు ఆయన `పూరీ మ్యూజింగ్స్` పేరుతో ఎన్నో విషయాలు చెబుతూనే ఉన్నారు. సూటిగా సుత్తిలేకుండా ఆయన చెప్పే మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందుకే పూరీ మ్యూజింగ్స్ మంచి క్రేజ్ ఉంది.

తాజాగా ఆయన ప్రాసెస్డ్ ఫుడ్ పై ఒక సందేశం ఇచ్చారు. బ్యాక్టీరియా కూడా ఇష్టపడని ఆహారాన్ని మనం తింటున్నామన్నారు. బ్యాక్టీరియా తినే దాన్నే మనమూ తినాలని అంటున్నారు. ఒకప్పుడు సముద్రంలో జీవించే మనం తర్వాత ఉభయచరాలుగా మారామని భూమి మీద పాకుతూ క్రమంగా మనుషులయ్యామని అంటున్నారు ఈ రెబల్ డైరెక్టర్. దీంతో సముద్రం, ఉప్పు మనకు దూరమయ్యాయట. రోజూ వేటాడే సత్తా క్రమంగా తగ్గిపోవడంతో ఆహారాన్ని నిల్వ చేసే విధానం మొదలుపెట్టామట. అలా ఫుడ్ ను ప్రాసెస్ చేయడాన్ని అలవాటు చేసుకున్నామంటున్నాడు పూరీ. న్యాచురల్ ఫుడ్ ను అన్ న్యాచురల్ గా మనమే చేస్తున్నామట. ఇక దాన్ని బాడీ ఎలా డైజెస్ట్ చేసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. అయినా ఎలాగోలా మన శరీరం ఆ పరాయి ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు.

ఆరడుగుల చెరుకు గడ తింటే రెండు స్పూన్ల చక్కెర మనకు బాడీకి అందితే.. మనం ఒకేసారి రెండు స్పూన్లకు మించి షుగర్ ను బాడీలోకి పంపిస్తున్నాం అంటున్నారు. ఇలా శరీరాన్ని ఇబ్బందిపెట్టే ఆహారం తీసుకోవడంతోనే మనం ఏవేవో రోగాల బారిన పడుతున్నామన్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మేలు అంటున్నారు. జంతికలు, చేగోడీలు, పచ్చళ్లను బ్యాక్టీరియా అస్సలు తినదు.. మరి బ్యాక్టీరియానే తినని ఆహారాన్ని మనం తింటున్నాం. అందుకే బ్యాక్టీరియా ఏం తింటే అదే మనం తిందాం.. ఆరోగ్యంగా ఉందాం.. అంటున్నారు మన పూరీ. మొత్తానికి ప్రాసెస్ ఫుడ్ మనల్ని చంపేస్తుందని దానికి దూరంగా ఉండమంటున్నారు మన డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్. మరి పూరీ చెప్పిన మాట విందామా.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే