గూర్ఖా నేత బిమల్ గురుంగ్ ప్రత్యక్షం, డార్జిలింగ్ లో నిరసనలు
మూడు రోజుల క్రితం అదృశ్యమైన గూర్ఖా జన్ ముక్తి మోర్చా నేత బిమల్ గురుంగ్ నిన్న డార్జిలింగ్ లో మళ్ళీ కోల్ కతా లో ప్రత్యక్షమయ్యారు. ఆయన లేని ఈ మూడు రోజుల్లో డార్జిలింగ్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఆయన వ్యతిరేకవర్గం..

మూడు రోజుల క్రితం అదృశ్యమైన గూర్ఖా జన్ ముక్తి మోర్చా నేత బిమల్ గురుంగ్ నిన్న డార్జిలింగ్ లో మళ్ళీ కోల్ కతా లో ప్రత్యక్షమయ్యారు. ఆయన లేని ఈ మూడు రోజుల్లో డార్జిలింగ్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఆయన వ్యతిరేకవర్గం..తమాంగ్ జన్ ముక్తి మోర్చా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. బిమల్ గురుంగ్ మళ్ళీ ఎందుకు వచ్చాడని, ఆయన వస్తే తిరిగి హింస చెలరేగుతుందని ఆరోపిస్తూ ఈ వర్గం ధర్నాకు కూర్చుంది. బినయ్ తమాంగ్ ఆధ్వర్యంలో ఈ ప్రొటెస్ట్ జరిగింది. అయితే బిమల్ గురుంగ్ సహచరులు కూడా ఈ ధర్నాను వ్యతిరేకిస్తూ తాము సైతం నిరసనలకు పూనుకొన్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్డీయే నుంచి వైదొలగిన గూర్ఖా జన్ ముక్తి మోర్చా.. తాము తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తామని ఇదివరకే ప్రకటించింది. గూర్ఖాల్యాండ్ ఇస్తామని హామీ ఇఛ్చిన బీజేపీ… ఆ హామీని నెరవేర్చడంలో విఫలమైందని బిమల్ గురుంగ్ ఆరోపించారు.