Papaya Farmers: పంట దండిగా పండిదనుకుంటే, ఈ బాధలేంది సారూ..!

|

Jul 30, 2021 | 7:21 AM

బొప్పాయి రైతుకు దళారులు సహకరించడం లేదు. అకాల వర్షాలతో ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన రైతులను.. దళారుల సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారు.

Papaya Farmers: పంట దండిగా పండిదనుకుంటే, ఈ బాధలేంది సారూ..!
Papaya Farmers
Follow us on

బొప్పాయి రైతుకు దళారులు సహకరించడం లేదు. అకాల వర్షాలతో ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన రైతులను.. దళారుల సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల కడప జిల్లా బొప్పాయి రైతు నష్టాల పాలైతే.. తాజాగా దళారులంతా ధరలు తగ్గించి తమను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు కడప జిల్లా రైల్వేకోడూరు బొప్పాయి రైతులు. బొప్పాయి కోతలు ఆరంభంలో టన్ను13 వేలకు పైనే ధర ఉండేది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబాయ్‌, కోల్‌కత్తా తదితర ప్రాంతాల్లో వర్షాలు విపరీతంగా పడడంతో.. దీంతో బొప్పాయి టన్ను ధర రూ.10 వేలకు పడిపోయింది. అక్కడ వర్షాలు కురవడంతో.. ఇక్కడి నుంచి లారీలు వెళ్లలేకపోతున్నాయని అందు వల్లే ధరలు తగ్గించారని లోకల్ వ్యాపారులు అంటున్నారు.  ధరలు బాగా ఉన్నాయని సంతోషంగా ఉన్న సమయంలో.. ఇలా తగ్గించడమేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

బొప్పాయి కాయలు అంటే రైల్వేకోడూరుకు పెట్టింది పేరు. రైల్వేకోడూరు నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు బొప్పాయి కాయలు ఎగుమతి అవుతాయి. ప్రతీ సీజన్‌లో మార్వాడీలు రైల్వేకోడూరులో సరుకు కొని.. ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఈ సారి భారీ వర్షాలు రావడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. అంతేకాక ధరలు కూడా బాగా పడిపోయాయి. కిలో బొప్పాయి గతవారం 15 రూపాయాలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా 5 రూపాయాలకు పడిపోవడంతో చేసేది ఏమీ లేక ఆందోళన బాట పట్టారు బొప్పాయి రైతులు, కోడూరు-తిరుపతి జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో 15 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి ఇంకా ధరలు తగ్గించే అవకాశం ఉందని.. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు బొప్పాయి రైతులు.

Also Read: మంత్రి కేటీఆర్‌ సాయం కోరిన యాంకర్‌ రష్మీ గౌతమ్‌.. దేని కొరకు అంటే..!

 ఎస్‌బీఐలో ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే ఎన్నో లాభాలు.. లోన్‌ సదుపాయం కూడా.. అధిక వడ్డీ