AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya New Song: మాస్ పాటకు స్పెప్పులు వేసిన ‘వింకిల్‌ గర్ల్‌’… తొలిసారి ప్రైవేటు సాంగ్‌కు కాలు కదిపిన బ్యూటీ…

Priya Dance For Mass Song: 'ఓరు ఆదర్‌ లవ్‌' అనే సినిమాలో ఒక చిన్న సన్నివేశంతో యావత్‌ దేశాన్ని తనవైపు తిప్పుకుంది మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌...

Priya New Song: మాస్ పాటకు స్పెప్పులు వేసిన 'వింకిల్‌ గర్ల్‌'... తొలిసారి ప్రైవేటు సాంగ్‌కు కాలు కదిపిన బ్యూటీ...
Narender Vaitla
|

Updated on: Jan 15, 2021 | 12:10 AM

Share

Priya Dance For Mass Song: ‘ఓరు ఆదర్‌ లవ్‌’ అనే సినిమాలో ఒక చిన్న సన్నివేశంతో యావత్‌ దేశాన్ని తనవైపు తిప్పుకుంది మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. కన్ను కొట్టే సన్నివేశంతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ అనంతరం పలు భాషల్లో వరుస సినిమా అవకాశాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో తన గొంతుతోనూ మ్యాజిక్‌ చేసిన ఈ బ్యూటీ ఓ సినిమాలో పాట కూడా పాడింది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ తెలుగు మాస్ సాంగ్‌లో స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంటోంది. సంక్రాంతికి కానుకగా విడుదలైన ఈ పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘లడి లడి’ అని సాగే ఈ మాస్‌ బీట్‌లో రోహిత్‌ నందన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఇక పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌ తెరకెక్కించారు. శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించిన ఈ పాటకు విస్సా ప్రగడ లిరిక్స్‌ రాశాడు. పబ్‌లో పక్కా మాస్‌ సాంగ్‌గా తెరకెక్కించిన ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా ప్రియా ప్రకాశ్‌ వేసిన మాస్‌ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రియా ప్రస్తుతం నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘చెక్‌’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మరి ప్రియ మాస్‌ చిందులను మీరూ ఓసారి చూసేయండి..

Also Read: ఉపేంద్ర ప్యాన్ ఇండియన్ మూవీ అప్‌డేట్.. సుదీప్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆసక్తిని రెట్టింపు చేసిన మేకర్స్..