ఉపేంద్ర ప్యాన్ ఇండియన్ మూవీ అప్‌డేట్.. సుదీప్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆసక్తిని రెట్టింపు చేసిన మేకర్స్..

Kabzaa Movie Update: ‘కన్నడ’ సూపర్ స్టార్ ఉపేంద్ర ‘కబ్జా’ అనే ప్యాన్ ఇండియన్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు..

  • Ravi Kiran
  • Publish Date - 7:23 pm, Thu, 14 January 21

Kabzaa Movie Update: ‘కన్నడ’ సూపర్ స్టార్ ఉపేంద్ర ‘కబ్జా’ అనే ప్యాన్ ఇండియన్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కిస్తున్నాడు. ‘బ్రహ్మ’, ‘ఐ లవ్ యూ’ తర్వాత ఉపేంద్ర-చంద్రు కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇదే. ఇక ఈ మూవీ 7 భాషల్లో విడుదల కానుంది.

సంక్రాంతి కానుకగా హీరో కిచ్చా సుదీప్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ‘భార్గవ్ భక్షి’ పాత్రను సుదీప్ పోషించబోతున్నారు. 1947-1986 మధ్య మాఫియాను అంతం చేసే బాద్షాగా ఆయన కనిపించనున్నారు. ఇంతకు ముందే ఉపేంద్ర- సుదీప్ కాంబినేషన్‌లో ‘ఓ మై గాడ్’ కన్నడ రీమేక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.