ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.
ప్రగ్యా పర్సనల్ విషయానికి వస్తే.. 1991 జనవరి 12న జన్మించిన ఈమె ముందుగా కొన్ని యాడ్ ఫిల్మ్స్‌లో నటించింది.
నటించింది. ప్రగ్యా జైస్వాల్ పూణెలోని సింబైసిస్ లా స్కూల్‌లో చదువుకుంది. కాలేజీలో అందాల పోటీల్లో పాల్గొని అక్కడ కూడా సత్తా చాటింది.
2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు/ డేగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో పరిచయమైంది.
హిందీలో టిటూ MBA సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె తెలుగులో కంచె తర్వాత నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర సినిమాలు ఈమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి.
ఈమె కెరీర్‌లో ఎన్ని సినిమాల్లో నటించినా.. కంచె మంచి సినిమాగా గుర్తింపు ఇస్తే.. అఖండ కమర్షియల్ సక్సెస్ అందించింది.
ఇక ప్రగ్యా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.