హిందువులకు దీపావళి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన పాకిస్తాన్ ప్రధాని

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ దేశంలోని మైనార్టీ హిందువులకు పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ సోషల్ మీడియా వేడుకగా శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని హిందు సోదరులందరికి దీపావళి శుభాకాంక్షలు...

హిందువులకు దీపావళి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన పాకిస్తాన్ ప్రధాని
Follow us

|

Updated on: Nov 14, 2020 | 8:10 PM

Prime Minister Imran Khan Wishes : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ దేశంలోని మైనార్టీ హిందువులకు పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ సోషల్ మీడియా వేడుకగా శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని హిందు సోదరులందరికి దీపావళి శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు. ఇదిలావుంటే దీపావళి పండగను పాకిస్తాన్‌ హిందూవులు కూడా ఘనంగా జరుపుకుంటారు. భారత్‌లో మాదిరే దీపాలు వెలిగించి మిఠాయిలు పంచుకుంటారు.

ఆలయాలు, గృహాలను అందంగా అలంకరించుకుని సంబరాలు జరుపుకుంటారు. ప్రత్యేకంగా లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కరాచీ, లాహోర్ లాంటి ప్రధాన నగరాలతో పాటు, మాటియారి, టాండో అల్లాహార్, టాండో ముహమ్మద్ ఖాన్, జంషోరో, బాడిన్, సంఘర్, హాలా, టాండో ఆడమ్, షాదాద్‌పూర్‌లలో కూడా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతాయి.

ఇక పాకిస్తాన్‌ మైనారిటీ వర్గాల్లో హిందువులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో 75 లక్షల మంది హిందువులు ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి.