ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలం పొడిగింపు, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
సంజయ్ కుమార్ మిశ్రాను మరో ఏడాది పాటు ఈడీ డైరెక్టర్‌గా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు..
సంజయ్ కుమార్ మిశ్రాను మరో ఏడాది పాటు ఈడీ డైరెక్టర్‌గా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు..2018 నియామక ఉత్తర్వులను సవరించినట్టు కేంద్ర ఆర్థికశాఖ నేతృత్వంలోని రెవెన్యూ విభాగం పేర్కొంది. 2018, నవంబర్ 19న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛీఫ్‌గా నియమితులైన మిశ్రా(60)…1984 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి. వచ్చేవారంలో రెండేళ్ల ఆయన పదవీ కాలం ముగియనుండడంతో గవర్నమెంట్ మరో ఏడాది పొడిగించింది. సాధారణంగా ఈడీ ఛీఫ్ పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. కానీ, మిశ్రాను మరో ఏడాది డైరెక్టర్‌గా కొనసాగించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి అనుమతి పొందాకే ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది.
‘‘ఈడీ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రాను నియమిస్తూ 2018 నవంబర్ 19న వెలువరించిన ఉత్తర్వులను సవరించేందుకు భారత రాష్ట్రపతి కోవింద్ సమ్మతించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈడీ చీఫ్‌గా ఉంటారు..’’ అని ఐటీ విభాగం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ చట్టాలైన అక్రమ లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం (ఎఫ్ఈఎంఏ) అమలు కోసం ఈడీ పనిచేస్తుంది. ఉగ్రవాదులకు నిధులు, మనీల్యాండరింగ్, హవాలా, నల్లధనం, దేశ సరిహద్దులకు ఆవతల జరిగే అక్రమ ఆర్థిక లావాదేవీలు నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను చేసింది.
Also Read :
అక్రమ సంబంధం : భర్తను వదిలేసింది, నాలుగేళ్ల కుమారుడిని చంపేసింది
మేడపై నుంచి 14 రోజుల బిడ్డను కిందకు పడేసిన తల్లి..కనీసం కడుపు తీపి లేకుండా..?
ఏపీలో విద్యార్థుల కోసం ప్రత్యేక వెబ్సైట్.. ఆశయాల వైపు పయనించేలా వినూత్న ఆలోచన