AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కేంద్ర విద్యా శాఖ’ పేరుకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యా శాఖగా మార్చుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆమోద‌ముద్ర వేశారు.

'కేంద్ర విద్యా శాఖ' పేరుకు రాష్ట్రపతి ఆమోదం
Ram Naramaneni
|

Updated on: Aug 18, 2020 | 8:43 AM

Share

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యా శాఖగా మార్చుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆమోద‌ముద్ర వేశారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బిజినెస్ రూల్స్‌లో సవరణలు చేశారు.

భారత ప్రభుత్వ (అలకేషన్ ఆఫ్ బిజినెస్​) నిబంధనలు-1961లోని మొదటి, రెండు షెడ్యూల్స్‌లో ఉన్న ‘మానవ వనరుల అభివృద్ధి శాఖ’ పేరును ‘విద్యా శాఖ’గా మారుస్తున్నట్లు వివ‌రించారు. రాజీవ్​ గాంధీ పీఎంగా ఉన్న స‌మ‌యంలో విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన మోదీ స‌ర్కార్.. మంత్రిత్వ శాఖ పేరును కూడా మార్చేందుకు నిర్ణయించింది. జులై 29న జరిగిన కేబినెట్​ భేటీలో నూతన విద్యా విధానం ముసాయిదా సిఫార్సుల ప్రకారం ఆమోదం తెలిపింది.

Also Read :

 తెలంగాణ అలెర్ట్ : ఈ 15 జిల్లాల‌కు భారీ వ‌ర్ష

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు, తాజా రేట్లు ఇలా !

ఏపీ : ఇకపై రాష్ట్ర విపత్తులుగా వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలు