AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ సారథ్యంలో సోనియా విఫలం.. మోదీది నియంతృత్వ విధానం.. ఆత్మకథలో మాజీ రాష్ట్రపతి..

కాంగ్రెస్ సారథిగా సోనియా గాంధీ పనితీరు, మాజీ ప్రధాని మహ్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్రమోదీల పనితీరుపై దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో రాసిన వ్యాఖ్యలు ఇప్పుడు

కాంగ్రెస్ సారథ్యంలో సోనియా విఫలం.. మోదీది నియంతృత్వ విధానం.. ఆత్మకథలో మాజీ రాష్ట్రపతి..
Rajitha Chanti
|

Updated on: Dec 12, 2020 | 12:28 PM

Share

కాంగ్రెస్ సారథిగా సోనియా గాంధీ పనితీరు, మాజీ ప్రధాని మహ్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్రమోదీల పనితీరుపై దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో రాసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను రాష్ట్రపతిగా వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోల్పోయిందని పేర్కొన్నారు. పార్టీని సమర్థవంతగా నిర్వహించడంలో సోనియా గాంధీ విఫలం కావడం.. మంత్రులకు, మన్మోహన్‏కు మధ్య వ్యక్తిగత సంప్రదింపులు ముగిసిపోవడం పార్టీ పతనానికి దారితీశాయని ప్రణబ్ తన ఆత్మకథలో రాసుకున్నారు. 2004లో నేను ప్రధాని పదవిని చేపట్టి ఉండుంటే.. 2014లో పార్టీ ఓటమి చెందేదికాదని చాలా మంది అన్నారు. కానీ ఆ విషయాన్ని నేను ఒప్పుకోను. కానీ నేను రాష్ట్రపతిగా వెళ్ళిన తర్వాత పార్టీ రాజకీయ దృష్టి కోల్పయిందని నమ్ముతున్నా.. పార్టీ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించడంలో సోనియా విఫలమయ్యారు. హౌస్‏కు మన్మోహన్ దూరంగా ఉండడంతో ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశాన్ని మంత్రులు కోల్పోయారు.

అయితే కూటమిని రక్షించుకోవడంలోనే మన్మోహన్ ఉండిపోయారు. కానీ మోదీ తన మొదటి ఐదేళ్ళ పాలన నియంతృత్వ విధానాన్ని అనుసరించినట్టే ఉంది. ప్రభుత్వం, చట్టసభలు, న్యాయవ్యవస్థ మధ్య చేదు సంబంధాలు నెలకొన్నాయి. ఈ విషయం ఆయన రెండవ పాలనలో మరింత బాగా అర్థమవుతుందా? అన్న విషయం మాత్రం కాలమే చెబుతుంది. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఇండియాలో పర్యటించినప్పుడు ఆయన నన్ను తన కారులో కూర్చోమన్నారు. అందుకు నేను ఒప్పుకోలేదు. అమెరికా అధ్యక్షుడు, భారత రాష్ట్రపతితో కలిపి ప్రయాణించేటప్పుడు భారత ప్రభుత్వ భద్రతా ఏర్పాట్లను నమ్మాలి. అదే విషయం అమెరికా అధికారులకు తెలపాలని విదేశీ వ్యవహారాల శాఖకు చెప్పాను అని ప్రణబ్ తన ఆత్మకథలో పేర్కొన్నట్టు పబ్లిషర్ సంస్థ తెలిపింది. కాగా 84 ఏళ్ళ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కరోనా భారినపడి జూలై 31న మృతిచెందారు. ఆయన రాసిన ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అత్మకథను రూపా పబ్లిషర్స్ వచ్చే జనవరిలో ప్రచురించనుంది.