Prabhas Wishes Deepika: దీపికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన డార్లింగ్.. ‘అందమైన సూపర్ స్టార్’ అంటూ..
Prabhas Wishes To Deepika: కన్నడ చిత్రం 'ఐశ్వర్య'తో వెండితెరకు పరిచయమైంది అందాల తార దీపికా పదుకొణె. అనంతరం షారుక్‌ఖాన్ హీరోగా బాలీవుడ్‌లో వచ్చిన 'ఓం శాంతి ఓం'తో..
Prabhas Wishes To Deepika: కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’తో వెండితెరకు పరిచయమైంది అందాల తార దీపికా పదుకొణె. అనంతరం షారుక్‌ఖాన్ హీరోగా బాలీవుడ్‌లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్ బాటపట్టింది. తొలి సినిమాతోనే తనదైన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన దీపికా.. మొదటి చిత్రంతోనే ‘బెస్ట్ డెబ్యూ యాక్టర్’గా ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఇక అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి బాలీవుడ్ అగ్ర కథనాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకుంది. ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకెళుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దీపికా.. వివాహం తర్వాత కూడా సినిమాలో వేగాన్ని తగ్గించలేదు. ఇక ఈ అందాల తార పుట్టిన రోజు నేడు (మంగళవారం, జనవరి5). ఈ సందర్భంగా అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు దీపికాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దీపికాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీపికా ఫొటో పోస్ట్ చేసిన ప్రభాస్.. ‘అందమైన సూపర్‌స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్ జోడించాడు. ఇదిలా ఉంటే మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రభాస్‌కు జోడిగా దీపిక నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇక ప్రభాస్‌తో టాలీవుడ్ హీరోయిన్.. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా దీపికాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. దీపికతో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తమన్నా.. ‘హ్యాపీ బర్త్‌డే తమన్నా.. నీకు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం కావాలని ఆశిస్తున్నాను’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
View this post on Instagram
Happy happy birthday @deepikapadukone ? May you have an incredibly special year ahead! ❤️ pic.twitter.com/6T6QUC913O
— Tamannaah Bhatia (@tamannaahspeaks) January 5, 2021
Also Read: Actress Sanjana Galrani : మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్న’బుజ్జిగాడు’ బ్యూటీ..