Prabhas: దీపికకు అదిరిపోయే ఆతిథ్యమిచ్చిన ప్రభాస్‌.. రుచికరమైన వంటకాలతో స్పెషల్ ట్రీట్‌..

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తన సహనటులను ఎలా గౌరవిస్తారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డార్లింగ్‌ సెట్‌లో ఉంటే అంతా సందడి సందడిగా ఉంటుందని అతనితో కలిసి పనిచేసిన నటీనటులు చెబుతుంటారు.

Prabhas: దీపికకు అదిరిపోయే ఆతిథ్యమిచ్చిన ప్రభాస్‌.. రుచికరమైన వంటకాలతో  స్పెషల్ ట్రీట్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2021 | 8:39 PM

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తన సహనటులను ఎలా గౌరవిస్తారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డార్లింగ్‌ సెట్‌లో ఉంటే అంతా సందడి సందడిగా ఉంటుందని అతనితో కలిసి పనిచేసిన నటీనటులు చెబుతుంటారు. ఇక ఆహార ప్రియుడైన ప్రభాస్‌ తన కో- యాక్టర్స్‌ కోసం ప్రత్యేకంగా రుచికరమైన వంటలు సిద్ధం చేయించి సెట్‌ కు తీసుకొస్తారు. గతంలో ‘బాహుబలి’, ‘సాహో’ సినిమా షూటింగ్‌ల సందర్భంగా తన తోటి నటీనటులకు భారీగా విందులు ఏర్పాటుచేసి సర్‌ప్రైజ్‌ చేశారు. ప్రస్తుతం అతను నటిస్తోన్న ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌లో కూడా హీరోయిన్‌ పూజా హెగ్డే, అలనాటి తార భాగ్యశ్రీలకు రుచికరమైన వంటకాలతో భారీ విందులు ఏర్పాటుచేశారు. తాజాగా తన ‘ప్రాజెక్టు- కె’ (వర్కింగ్‌ టైటిల్‌) హీరోయిన్‌, ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెకు కూడా అదిరిపోయే ఐటమ్స్‌తో భారీ ట్రీట్‌ ఏర్పాటుచేశారట. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో పంచుకుంది.

‘బాహుబలి’ సిరీస్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్‌ కె’ లో నటిస్తున్నాడు. దీపిక రెబల్‌స్టార్‌తో రొమాన్స్‌ చేయనుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో ప్రభాస్‌, దీపికా పదుకొణెలపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. దీంతో మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. కాగా తన షూటింగ్‌ పూర్తవ్వడంతో దీపిక తిరిగి ముంబయి వెళ్లిపోయింది. కాగా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయిన వెంటే ఆమె కోసం ప్రభాస్‌ రుచికరమైన వంటకాలతో భారీ విందును ఏర్పాటు చేశారట. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది దీపిక. ‘ప్రాజెక్ట్‌-కె’ లో నా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తైంది. లవ్లీ హైదరాబాద్‌. మళ్లీ కలుద్దాం’ అంటూ ఈ ఫొటోలను షేర్‌ చేసింది. కాగా ఈ సినిమాలోనే బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:

Virata Parvam: రానా బర్త్ డే స్పెషల్ అప్డేట్.. విరాటపర్వం నుంచి ‘ది వాయిస్ ఆఫ్ రవన్నా’.. ఎప్పుడంటే..

Saakini Daakini First Look: నివేదా.. రెజీనాకు పనిష్మెంట్.. ఆకట్టుకుంటున్న శాకిని డాకిని ఫస్ట్ లుక్ పోస్టర్..

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.. ఎవరో గుర్తుపట్టారా.!

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం