ప్రభాస్ కొత్త సినిమా ‘సలార్’ లాంఛనంగా ప్రారంభం, సంచలన ‘కేజీఎఫ్’ సినిమా డైరెక్టర్ తో మరో పాన్ ఇండియా మూవీ

Prabhas Salaar Movie : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ తో ఓ ఖతర్నాక్ దర్శకుడు తోడైతే ఎలా ఉంటుంది?..

  • Venkata Narayana
  • Publish Date - 1:35 pm, Fri, 15 January 21
ప్రభాస్ కొత్త సినిమా 'సలార్' లాంఛనంగా ప్రారంభం, సంచలన 'కేజీఎఫ్' సినిమా డైరెక్టర్ తో మరో పాన్ ఇండియా మూవీ

Prabhas Salaar Movie : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ తో ఓ ఖతర్నాక్ దర్శకుడు తోడైతే ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు రియాల్టీలోకి రాబోతోంది. దేశవ్యాప్తంగా కేజీఎఫ్ సినిమా ఎంత పాపులర్ అయ్యిందో తెలియంది కాదు. ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్‌తో ఓ ప్యాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా ఇవాళే ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలకు కేజీఎఫ్ హీరో యాష్ తోపాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక సినిమా పేరు ‘సలార్’. ఇప్పటికే ప్రభాస్ తన ప్యాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ షూటింగ్ ముగియడంతో అతి త్వరలో ‘సలార్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

మరోవైపు, కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2 పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి అవుతుండగానే ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌తో చేయబోతున్న ‘సలార్‌’ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళుతున్నాడు. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా, పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. సోషల్ కాన్సెప్ట్‌తో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని సమాచారం. ‘సలార్‌’ కోసం ప్రభాస్‌ నాలుగు నెలల సమయం కేటాయిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది పూర్తి కాగానే ‘ఆదిపురుష్‌’ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళుతాడట ప్రభాస్‌.