అమెజాన్ ఐడియా అదిరిపోలే? అసలు విషయాన్ని చెప్పడానికి క్రియేటివిటిగా ఏం చేసిందో తెలుసా..

Amazon Prime: ప్రముఖ అమెరికా ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి అందరికి తెలిసిందే.. ఓటీటీ పోటీల్లో తన

అమెజాన్ ఐడియా అదిరిపోలే? అసలు విషయాన్ని చెప్పడానికి క్రియేటివిటిగా ఏం చేసిందో తెలుసా..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 1:34 PM

Amazon Prime: ప్రముఖ అమెరికా ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి అందరికి తెలిసిందే.. ఓటీటీ పోటీల్లో తన సత్తాను చాటుతూ వినియోగదారులకు మరింత ఎంటర్‌టైన్ చేస్తోంది. సినిమాలతో పాటు, ఒరిజినల్ కంటెంట్స్‌ అందిస్తూ యావత్ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పడు ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ‘ప్రైమ్ వీడియో’ దాని పేరులోని ‘ఎమ్‌ఈ’ అక్షరాలను తొలగించి వేర్ ఈజ్ ఎమ్ఈ ( #WhereIsME) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తోంది. ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దీన్ని ట్రెండ్ చేస్తూ, హిట్ సినిమాల్లోని కొన్ని డైలాగుల్లో ‘ఎమ్‌ఈ’ మిస్ చేసి ఎడిట్ చేసి పోస్టులు షేర్ చేస్తోంది.

ఎందుకు ఇలా చేస్తోందంటే అసలు విషయాన్ని బయటపెట్టింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ మాదిరిగా, ప్రైమ్ కూడా తమ వినియోగదారుల కోసం మొబైల్ ఎడిషన్‌ (ఎమ్ఈ) ను ప్రవేశపెట్టింది. ఆ విషయాన్ని ప్రజలకు క్రియేటివ్‌గా చెప్పడానికే ఈ పనిచేసింది. ఇండియాలో మొబైల్ వాడకం అత్యధికం. కాబట్టి వారి కోసమే అమెజాన్ ప్రత్యేకంగా ఈ మొబైల్ ఎడిషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతీయ కస్టమర్లలో ఎక్కువ శాతం మంది మొబైల్ డివైజ్ వాడుతారు. స్ట్రీమింగ్ ఎంగేజ్‌మెంట్‌లో ఇండియా టాప్ పొజిషనల్‌లో ఉంటుంది. అందువల్ల మా కస్టమర్లకు మరింత హై క్వాలిటీ కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్రారంభించామని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇకపై ఇంటికే మందులు.. ఆన్‌లైన్‌ ఫార్మసీలోకి ఈ కామర్స్ దిగ్గజం.. అమ్మకాలు మొదలుపెట్టిన అమెజాన్

నూతన చట్టాల ఆవశ్యకతను తెలిపే ప్రయత్నం చేస్తున్న ప్రధాని మోదీ.. సంస్కరణల తర్వాత రైతులకు..