పోలీసుల వల్లే వాడు ఉగ్రవాది అయ్యాడు: పుల్వామా ముష్కరుడు అదిల్ తల్లిదండ్రులు

పుల్వామా: పోలీసుల వల్లే తమ కుమారుడు ఉగ్రవాదిగా మారాడని.. కానీ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదని 40మంది జవాన్ల ప్రాణాలు తీసుకొన్న ముష్కరుడు అదిల్ అహ్మద్ దర్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ‘‘మూడేళ్ల క్రితం తమపైకి రాళ్లు విసిరాడన్న ఆరోపణలతో అదిల్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. ముక్కు నేలకు రాయిస్తూ జీపు చుట్టూ తిప్పించారు. దీన్ని వాడు అవమానంగా భావించాడు. రోజూ దాన్నే గుర్తుచేసుకునేవాడు. దీంతో పోలీసులపై కోపం పెంచుకున్నాడు. అప్పడే ఉగ్రవాదుల్లో చేరాలనుకున్నాడు’’ అంటూ అదిల్ తండ్రి […]

పోలీసుల వల్లే వాడు ఉగ్రవాది అయ్యాడు: పుల్వామా ముష్కరుడు అదిల్ తల్లిదండ్రులు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:06 PM

పుల్వామా: పోలీసుల వల్లే తమ కుమారుడు ఉగ్రవాదిగా మారాడని.. కానీ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదని 40మంది జవాన్ల ప్రాణాలు తీసుకొన్న ముష్కరుడు అదిల్ అహ్మద్ దర్ తల్లిదండ్రులు చెబుతున్నారు.

‘‘మూడేళ్ల క్రితం తమపైకి రాళ్లు విసిరాడన్న ఆరోపణలతో అదిల్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. ముక్కు నేలకు రాయిస్తూ జీపు చుట్టూ తిప్పించారు. దీన్ని వాడు అవమానంగా భావించాడు. రోజూ దాన్నే గుర్తుచేసుకునేవాడు. దీంతో పోలీసులపై కోపం పెంచుకున్నాడు. అప్పడే ఉగ్రవాదుల్లో చేరాలనుకున్నాడు’’ అంటూ అదిల్ తండ్రి గులామ్ హసన్ దర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని వీడాలని తాము చాలా సార్లు అదిల్‌ను కోరామని, కానీ తమ ప్రయత్నాలు ఫలించలేదని గులామ్ అన్నారు. కానీ ఇలా జవాన్లపై దాడి చేస్తాడని తాము ఊహించలేదని చెప్పారు.

కాగా 22ఏళ్ల అదిల్ చదువు ఆపేసి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. కొన్ని నెలల ముందు పుల్వామాకు 10కిలోమీటర్ల దూరంలో ఓ ఇల్లు తీసుకున్న అదిల్.. అక్కడే జైషే మహ్మద్ ఉగ్రవాదుల ఆధ్వర్యంలో ఉగ్ర కార్యకలాపాల్లో శిక్షణ తీసుకున్నాడు. గురువారం భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ జవాన్లు కాన్వాయ్‌లో వెళుతున్నారని ముందే తెలుసుకున్న అదిల్ పేలుడు పదార్థాలున్న కారుతో వెళ్లి కాన్వాయ్‌లోని బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో 40మంది జవాన్లు మృతి చెందగా.. మరికొంత మంది గాయపడ్డారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?