Watch: బయట ఇలా.. లోపలేమో అలా..! టెంపుల్ సిటీలో డర్టీ పిక్చర్.. పోలీసుల ఎంట్రీతో..
టెంపుల్ సిటీలో స్పా మరక.. ఆధ్మాత్మిక నగరిలో డర్టీ పిక్చర్ కలకలం రేపింది.. తిరుపతిలో బ్రోతల్ దందాచేస్తోన్న స్పా సెంటర్లపై కొరడా తిరుపతి ఈస్ట్ పోలీసులు ఝులిపించారు. SEA 7 స్పా స్పెంటర్లో ముగ్గురు విటులను, నలుగురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు.
టెంపుల్ సిటీలో స్పా మరక.. ఆధ్మాత్మిక నగరిలో డర్టీ పిక్చర్ కలకలం రేపింది.. తిరుపతిలో బ్రోతల్ దందాచేస్తోన్న స్పా సెంటర్లపై కొరడా తిరుపతి ఈస్ట్ పోలీసులు ఝులిపించారు. SEA 7 స్పా స్పెంటర్లో ముగ్గురు విటులను, నలుగురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో అసాంఘీక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్పీ ఆదేశాలతో ఈస్ట్ తిరుపతిలోని 8 స్పాంటర్లపై పోలీసులు ఏకకాలంలో రెయిడ్ నిర్వహించారు. SEA 7 స్పా సెంటర్లో బ్రోతల్ రాకెట్‌ను బ్రేక్ చేశారు. ఢిల్లీ బ్యాచ్ ఈ దందాను నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సీ 7 స్పా సెంటర్ లో మేనేజర్‌గా పనిచేస్తున్న మనీషా.. స్పా ఆర్గనైజర్స్ మహీ ఆమె భర్త అఫ్తాబ్ లపై కేసు నమోదు చేశారు. ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరున్నారో కూపీలాగుతున్నారు. స్పిరిచువల్ సిటీ తిరుపతి బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
స్పా, సెలూన్, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గతంలో అభియోగాలున్నాయి.. ఈ విషయంపై తిరుపతి ఎస్పీకి సైతం పలు ఫిర్యాదులు అందాయి.. ఈ నేపథ్యంలో ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ.. దాడులు నిర్వహించాలని ఆదేశించారు.. దీంతో స్పా మసాజ్ సెంటర్ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..