AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. టీడీపీ నేతలకు నోటీసులు!

ఏపీలో సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. టీడీపీ, అమరావతి జేఏసీ ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సెక్షన్ 149 కింద పోలీసులు ఇప్పటికే టీడీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. గృహ నిర్బంధాలపై పోలీసులు హెచ్చరించారు. హింసాత్మక చర్యలను నిరోధించడానికి టీడీపీ నాయకులతో పాటు షాడో పోలీసులు ఉంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి అచ్చెనాయుడుకు పోలీసులు నోటీసులు […]

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. టీడీపీ నేతలకు నోటీసులు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 19, 2020 | 4:05 PM

Share

ఏపీలో సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. టీడీపీ, అమరావతి జేఏసీ ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సెక్షన్ 149 కింద పోలీసులు ఇప్పటికే టీడీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. గృహ నిర్బంధాలపై పోలీసులు హెచ్చరించారు. హింసాత్మక చర్యలను నిరోధించడానికి టీడీపీ నాయకులతో పాటు షాడో పోలీసులు ఉంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి అచ్చెనాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేసారు.

మరోవైపు చంద్రబాబు నాయుడు టీడీఎల్‌పీ సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరి ఆత్మకూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో అమలు చేయాల్సిన వ్యూహంపై చర్చించడానికి అన్ని ప్రాంతాల నాయకులు వస్తున్నారు.

Follow Us