విపక్షాలు లేకుండానే అఖిలపక్ష భేటీ..!

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’(జమిలి ఎన్నికలు) అనే అంశంపై చర్చించేందుకు మోదీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో ఐదు అంశాలపై టీఆర్ఎస్ తరఫున అభిప్రాయాన్ని కేటీఆర్, మోదీకి వివరించనున్నారు. కాగా ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, […]

విపక్షాలు లేకుండానే అఖిలపక్ష భేటీ..!
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2019 | 4:29 PM

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’(జమిలి ఎన్నికలు) అనే అంశంపై చర్చించేందుకు మోదీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో ఐదు అంశాలపై టీఆర్ఎస్ తరఫున అభిప్రాయాన్ని కేటీఆర్, మోదీకి వివరించనున్నారు. కాగా ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరుకాలేదు. వీరితో పాటు ఎన్డీయే భాగస్వామి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే కూడా గైర్హాజరవ్వడం విశేషం.

అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో జమిలి ఎన్నికలే జరిగాయి. ఆ తరువాత కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడిన రాజకీయ అస్థిరత కారణంతో వేర్వేరుగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలి ఎన్నికలను అత్యధిక పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, డీఎంకే, ఎన్పీపీ, ఆర్జేడీ, ముస్లిం లీగ్, ఎంఐఎం, నేషనల్ కాన్ఫరెన్స్, ఆప్ వంటి పార్టీలు ఈ ప్రతిపాదనను వద్దంటున్నాయి.