మహాత్ముల స్మృతిలో… మోదీ

రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ.. ఇవాళ రాజ్‌‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఉదయం రాజ్‌ఘాట్‌కు చేరుకున్న నరేంద్ర మోదీ మహాత్మాగాంధీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. Paid tributes to respected Bapu at Rajghat. This year, we mark the 150th Jayanti of Bapu. May this special occasion further popularise Bapu’s noble […]

మహాత్ముల స్మృతిలో... మోదీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 30, 2019 | 11:32 AM

రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ.. ఇవాళ రాజ్‌‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఉదయం రాజ్‌ఘాట్‌కు చేరుకున్న నరేంద్ర మోదీ మహాత్మాగాంధీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

అనంతరం అక్కడి నుంచి రాష్ట్రీయ స్మృతి స్థల్‌కు చేరుకున్నారు. అక్కడ మాజీ ప్రధాని వాజ్‌పేయి సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. మోదీతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు వాజ్‌పేయికి నివాళులర్పించారు.

అక్కడి నుంచి నేషనల్ వార్ మెమోరియల్ వద్దకు చేరుకుని.. అమర జవాన్ల స్థూపం వద్ద వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు.ఈరోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.