బైడెన్, కమాలాహారిస్‌కు మోదీ, చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ విజయం సాధించడంపై ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వాల్డ్‌వైడ్‌గా వివిధ దేశాధినేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా బైడెన్, కమలాహారిస్‌కు విషెస్ చెప్పారు. బైడెన్ రాకతో భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు నరేంద్ర మోదీ కంగ్రాట్స్ చెప్పారు. గతంలో ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండియా – అమెరికా సంబంధాలను […]
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ విజయం సాధించడంపై ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వాల్డ్‌వైడ్‌గా వివిధ దేశాధినేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా బైడెన్, కమలాహారిస్‌కు విషెస్ చెప్పారు. బైడెన్ రాకతో భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు నరేంద్ర మోదీ కంగ్రాట్స్ చెప్పారు. గతంలో ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండియా – అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరోసారి మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను అంటూ మోదీ ట్వీట్ చేశారు. ముఖ్యంగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌కు ప్రధాని మోదీ వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు. అమెరికా ఎన్నికల సమయంలో కమలా హారిస్ ఉపయోగించిన తమిళ ‘చిట్టీస్’ పదాన్ని వాడుతూ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. మీ విజయం అందరికీ మార్గనిర్దేశం. మీరు సాధించిన ఘనత కేవలం మీ ‘చిట్టీస్‌కే కాదు.. ఇండియన్ అమెరికన్లు అందరికీ గర్వకారణం. మీ నాయకత్వం, సహకారంతో శక్తివంతమైన ఇండియా- అమెరికా సంబంధాలు మరింత ధృఢంగా మారుతాయని పూర్తిగా విశ్వసిస్తున్నా’’ అంటూ కమలాహారిస్‌కు అభినందనలు చెప్పారు. అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా బైడెన్, కమలా హారిస్ కు శుభాకాంక్షలు తెలిపారు.