AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాలో మరో కొత్త వ్యాధి.. మొదలైన అలజడి.!

Plague Panic Chinese county declares emergency: కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో మరో కొత్త వ్యాధి బయటపడింది. యున్నన్ ప్రావిన్స్‌లోని మెంగాయ్ ప్రాంతంలో ఈ వ్యాధిని అధికారులు గుర్తించారు. మూడేళ్ల పిల్లాడిలో ప్లేగు వ్యాధిని పోలిన వ్యాధిని గుర్తించిన అధికారులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు ఆ కౌంటీ అంతటా స్క్రీనింగ్ నిర్వహించి లెవెల్ 4 ఎమర్జెన్సీను విధించారు. ఈ వ్యాధి ఎలుకల ద్వారా మనిషికి సోకుతుందని… వ్యాధి సోకిన ఎలుకలు తిరిగిన ప్రదేశంలో తిరగడం వల్ల […]

చైనాలో మరో కొత్త వ్యాధి.. మొదలైన అలజడి.!
Ravi Kiran
|

Updated on: Sep 29, 2020 | 9:17 PM

Share

Plague Panic Chinese county declares emergency: కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో మరో కొత్త వ్యాధి బయటపడింది. యున్నన్ ప్రావిన్స్‌లోని మెంగాయ్ ప్రాంతంలో ఈ వ్యాధిని అధికారులు గుర్తించారు. మూడేళ్ల పిల్లాడిలో ప్లేగు వ్యాధిని పోలిన వ్యాధిని గుర్తించిన అధికారులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు ఆ కౌంటీ అంతటా స్క్రీనింగ్ నిర్వహించి లెవెల్ 4 ఎమర్జెన్సీను విధించారు.

ఈ వ్యాధి ఎలుకల ద్వారా మనిషికి సోకుతుందని… వ్యాధి సోకిన ఎలుకలు తిరిగిన ప్రదేశంలో తిరగడం వల్ల గానీ.. అవి కొరకడం వల్ల గానీ.. లేదా వాటిపై వాలిన ఈగల ద్వారా గానీ ఈ వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని వైద్యాధికారులు తెలిపారు. బుబోనిక్ ప్లేగు అనేది బ్యాక్టీరియా వ్యాధి. దీనికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే 24 గంటల్లో రోగి చనిపోతాడు. ‘బ్లాక్ డెత్’ అని కూడా పిలువబడే ఈ వ్యాధి వల్ల 14వ శతాబ్దంలో 200 మిలియన్ల మంది ప్రాణాలు విడిచారు.

కాగా, మంగోలియాలోని ఖెంటి ప్రావిన్స్‌లో కూడా ఇలాంటి వ్యాధికి సంబంధించిన కేసులు తాజాగా బయటపడ్డాయి. వాస్తవానికి మంగోలియాలో ఎలుకలను చంపడం చట్ట విరుద్ధం.. కానీ అక్కడి వారు ఆ చట్టాన్ని విస్మరించి వేల సంఖ్యలో ఎలుకలను వేటాడతారు. దీనితో మొత్తం 21 మంగోలియన్ ప్రావిన్సులలో పదిహేడు ఇప్పుడు బుబోనిక్ ప్లేగు బారినపడే ప్రమాదం ఉందని నేషనల్ సెంటర్ అఫ్ జూనిటిక్ డిసీజెస్ హెచ్చరించింది. 

Also Read:

నాలుగేళ్ల డిగ్రీ చేసినవారికి పీహెచ్‌డీ అడ్మిషన్లు..

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. రూ. 35 వరకు పెరగనున్న టికెట్ ధర!

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్