Petrol Price: ఓ వైపు ఫైన్‌ల బాదుడు.. మరోవైపు పెరుగుతున్న ఇంధన ధరలు..

| Edited By:

Sep 10, 2019 | 11:36 AM

దేశీ ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. అసలే కొత్త వెహికిల్ చట్టంతో ఫైన్‌లు కడుతున్న సామాన్య ప్రజానీకానికి మరో షాక్ తగిలినట్లైంది. మంగళవారం పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 5 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.28కు చేరింది. డీజిల్ ధర కూడా రూ.71.01కు చేరింది. తెలంగాణలోనే కాదు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి.. రూ.76.03కు […]

Petrol Price: ఓ వైపు ఫైన్‌ల బాదుడు.. మరోవైపు పెరుగుతున్న ఇంధన ధరలు..
Follow us on

దేశీ ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. అసలే కొత్త వెహికిల్ చట్టంతో ఫైన్‌లు కడుతున్న సామాన్య ప్రజానీకానికి మరో షాక్ తగిలినట్లైంది. మంగళవారం పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 5 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.28కు చేరింది. డీజిల్ ధర కూడా రూ.71.01కు చేరింది. తెలంగాణలోనే కాదు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి.. రూ.76.03కు చేరింది. డీజిల్‌ ధర కూడా 5 పైసలు పెరుగుదలతో రూ.70.42కు ఎగ బాకింది. ఇక విజయవాడలోనూ ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.75.66కు చేరింది. డీజిల్ ధర కూడా 5 పైసలు పెరిగి.. లీటర్ రూ.70.08కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.71.76కు చేరింది. డీజిల్ ధర కూడా 5 పైసలు పెరుగుదలతో రూ.65.14కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ ధర 5 పైసలు పెరగడంతో.. లీటర్ రూ.77.45కు చేరింది. డీజిల్ ధర కూడా 6 పైసలు పెరుగుదలతో రూ.68.32కు చేరింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వెహికిల్ చట్టం వల్ల.. వాహనాల కొనుగోళ్లు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఫైన్లు కట్టలేక కొంతమంది ఉన్న వాహనాలను కూడా ఇంటికే పరిమితం చేస్తున్నారు.