‘మిషన్‌ పుంగనూరు’ ప్రాజెక్టుకు నిధులు

చిత్తూరు జిల్లా పుత్తూరు కట్టుకే కాదు, పుంగనూరు ఆవుకు కూడా ప్రసిద్ధి. పుంగనూరు ఆవు ప్రపంచంలోని అతి చిన్న ఆవుల జాతులలో ఒకటి. వీటి పాలలో వెన్నశాతం అధికంగా ఉంటుంది..కరువు పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవటం వల్ల గతంలో పేదవాడి ఆవులుగా పేరుపొందాయి.

  • Jyothi Gadda
  • Publish Date - 3:22 pm, Sat, 5 September 20
‘మిషన్‌ పుంగనూరు’ ప్రాజెక్టుకు నిధులు

చిత్తూరు జిల్లా పుత్తూరు కట్టుకే కాదు, పుంగనూరు ఆవుకు కూడా ప్రసిద్ధి. పుంగనూరు ఆవు ప్రపంచంలోని అతి చిన్న ఆవుల జాతులలో ఒకటి. వీటి పాలలో వెన్నశాతం అధికంగా ఉంటుంది..ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రం పుంగనూరు పొట్టి జాతి ఆవులకు ప్రసిద్ధి. ఒంగోలు జాతి ఆవులకు మల్లే ‘పుంగనూరు’ కూడా దేశం గర్వించదగ్గ గోజాతి. కాని, ఇప్పుడు ఈ జాతి ఆవులు అంతరించి పోయే దశలో ఉన్నాయి.

పుంగనూరు ఆవును అత్యంత పవిత్రంగా భావిస్తారు. మోపురం ఉన్న దేశీ ఆవులేవైనా విశ్వశక్తిని (కాస్మిక్‌ ఎనర్జీని) గ్రహించి చుట్టూ ఉన్న వాతావరణంలోకి విడుదల చేస్తాయని నమ్ముతారు. దీనివల్ల పుంగనూరు ఆవు ఉన్న పరసరాల్లో దైవిక వాతావరణం నెలకొంటుందని భావిస్తారు.. అందుకే వీటితో బయట మార్కెట్లో భారీ వ్యాపారమే జరుగుతోంది.. ఒక్కో ఆవు ఇప్పుడు లక్షల్లో బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు.. ఆవు ఇంటి ముందు తిరిగితే బాగా కలిసి వస్తుందంటూ దొంగస్వాములు ప్రచారం మొదలు పెట్టడంతో ధనవంతులు ఇప్పుడు వీటిపై దృష్టిపెట్టారు.. ఎంత డబ్బాయినా లెక్క చేయకుండా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇకపోతే, ఇవి రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల పాలు ఇస్తాయి. సాధారణంగా ఆవుపాలలో ఔషధ విలువలతో పాటు 3 నుంచి 3.5 వరకు వెన్న శాతం ఉంటుంది. అదే పుంగనూరు ఆవు పాలలో 8 శాతం ఉంటుంది. ఎస్‌ఎన్‌ఎఫ్‌ (సాలిడ్స్‌ నాట్‌ ఫ్యాట్‌) 9 శాతం ఉంటుంది. దీనివల్ల పాలకు అధిక ధర లభిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానాల గోశాలలో పుంగనూరు ఆవులను పెంచుతున్నారు. ఈ ఆవు పాల నుండి వచ్చే నెయ్యిని శ్రీవారి అభిషేకానికి వాడుతుంటారు.

ప్రపంచంలోనే అతిపొట్టి జాతి ఆవులివి. 70–90 సెం.మీ ఎత్తు అంటే సుమారు రెండు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి. 115–200 కిలోల బరువు,..మామూలు ఆవు దూడ సైజులో ఉంటాయి..చూడటానికి చాలా ముచ్చటగా బొమ్మల మాదిరిగా అందంగా ఉంటాయి. లేత బూడిద, తెలుపు రంగులో విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు కలిగి ఉంటాయి. వీటి తోక నేలను తాకుతుంది… కరువు పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవటం వల్ల గతంలో పేదవాడి ఆవులుగా పేరుపొందాయి. అచ్చం ఎండు గడ్డితిని మనుగడ సాగించగలవు. ఇంతటి విశిష్టత ఉన్న ఆలీ కాలక్రమంలో అంతరించిపోయే దశకు చేరుకున్నాయి..పరిరక్షించుకోకపోతే ఎంతటి అపురూపమైన పశు జాతైనా కాలగర్భంలో కలిసిపోతుంది. రెండు తెలుగురాష్ట్రాల్లో ఉన్న పుంగనూరు ఆవుల సంఖ్య కేవలం మూడువందలు మాత్రమే.. అవి కూడా పుంగనూరు ఆవుల కోసం ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రాల్లో మాత్రమే ఉన్నాయి.. మిగిలినవి కొంతమంది ధనవంతుల ఇళ్లలో స్టేటస్ సింబల్ గా ఉన్నాయి..అందుకే ఏపీ సర్కార్ పుంగనూరు ఆవుల పునర్ సృష్టికి శ్రీకారం చుట్టింది. తెలుగుజాతికి మాత్రమే ప్రత్యేకమైన పుంగనూరు ఆవులను తిరిగి బతికించేంచేందుకు మిషన్ పుంగనూరు పేరుతో ఓ యజ్ఞాన్ని ప్రారంభిస్తోంది..

పుంగునూరు జాతి పశు సంతతి వృద్ధికి రూ.63 కోట్లతో చేపట్టనున్న మిషన్‌ పుంగనూరు రీసెర్చ్‌ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కడప జిల్లా పులివెందులలోని ఏపీ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ లిమిటెడ్‌లో ఐవీఎఫ్‌ సాంకేతికతతో నాణ్యమైన పుంగనూరు జాతి పశువులను ఉత్పత్తి చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు.