ఊపిరి పీల్చుకుంటున్న త‌మిళ‌నాడు, మొదలైన ప్రజా రవాణా

|

Sep 01, 2020 | 8:49 AM

తమిళనాడు రాష్ట్రంలో ప్రజా రవాణా ప్రారంభ‌మైంది. ఐదు నెలల తరువాత ప్రధాన పుణ్యక్షేత్రాలు తెరుచుకున్నాయి. చెన్నై మహానగరంతో సహా కోయంబత్తూర్, మదురై, తిరుచ్చి నగరాలలో నేటి నుండి బస్సులు రోడ్డెక్కనున్నాయి.

ఊపిరి పీల్చుకుంటున్న త‌మిళ‌నాడు, మొదలైన ప్రజా రవాణా
Follow us on

తమిళనాడు రాష్ట్రంలో ప్రజా రవాణా ప్రారంభ‌మైంది. ఐదు నెలల తరువాత ప్రధాన పుణ్యక్షేత్రాలు తెరుచుకున్నాయి. చెన్నై మహానగరంతో సహా కోయంబత్తూర్, మదురై, తిరుచ్చి నగరాలలో నేటి నుండి బస్సులు రోడ్డెక్కనున్నాయి. కరోనా లాక్ డౌన్ నిబంధనల నుండి ఆలయాలకు మినహాయింపు ఇవ్వడంతో నేటి నుండి భ‌క్తులకు దేవుళ్ల ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించ‌నున్నారు అధికారులు. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం, తిరుచ్చి శ్రీరంగం, కంచిలో ఉన్న ఆలయాలతో సహా పలు పుణ్యక్షేత్రాలను పూర్తిగా శానిటైజ్ చేశారు ఆల‌య నిర్వాహ‌కులు. దర్శనాలకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలను పాటించేలా ఏర్పాట్లు చేశారు. సిటీ బస్సులతో సహా ఇతర జిల్లాలకు వెళ్లే బస్సులను పూర్తిగా శానిటైజ్ చేసి ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

 

Also Read :

ఏపీలో పింఛ‌న్లు : నేటి నుంచే మ‌ళ్లీ బయోమెట్రిక్ అమల్లోకి

అలెర్ట్ : దేశ‌వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

హైదరాబాద్‌లో నేడు ట్రాపిక్‌ ఆంక్షలు : ఇవిగో వివ‌రాలు