“క‌రోనాతో క‌లిసి జీవించ‌డం నేర్చుకోవాలి…వాస్త‌వాలు గ్ర‌హించాలి”

|

May 04, 2020 | 5:20 PM

కరోనా వైరస్ పై ఇటీవ‌ల ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లను కొంద‌రు త‌ప్పు ప‌ట్టిన విష‌యం తెలిసిందే. క‌రోనా ఇప్ప‌ట్లో మాయం కాదని.. దానితో సహజీవనం చేయాల్సి ఉంటుందని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీనిపై ప్ర‌తిపక్షాలు సీఎంను టార్గెట్ చేశాయి. జ‌గ‌న్ అనుభ‌వ రాహిత్యంతో కూడిన మాట‌లు మాట్లాడుతున్నార‌ని ఎద్దేవా చేశాయి. అయితే డబ్ల్యూహెచ్‌వోతోపాటు ప‌లువు‌రు ఆరోగ్య నిపుణులు కూడా క‌రోనాపై ఏపీ సీఎం త‌ర‌హా వ్యాఖ్య‌లే చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. […]

క‌రోనాతో క‌లిసి జీవించ‌డం నేర్చుకోవాలి...వాస్త‌వాలు గ్ర‌హించాలి
Follow us on

కరోనా వైరస్ పై ఇటీవ‌ల ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లను కొంద‌రు త‌ప్పు ప‌ట్టిన విష‌యం తెలిసిందే. క‌రోనా ఇప్ప‌ట్లో మాయం కాదని.. దానితో సహజీవనం చేయాల్సి ఉంటుందని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీనిపై ప్ర‌తిపక్షాలు సీఎంను టార్గెట్ చేశాయి. జ‌గ‌న్ అనుభ‌వ రాహిత్యంతో కూడిన మాట‌లు మాట్లాడుతున్నార‌ని ఎద్దేవా చేశాయి. అయితే డబ్ల్యూహెచ్‌వోతోపాటు ప‌లువు‌రు ఆరోగ్య నిపుణులు కూడా క‌రోనాపై ఏపీ సీఎం త‌ర‌హా వ్యాఖ్య‌లే చేస్తున్నారు.

తాజాగా తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌తో కలిసి జీవించడం ఎలాగో ప్రజలు నేర్చుకోవాలని సూచించారు. వాస్తవాలను గ్రహించాలన్న కేటీఆర్.. కోవిడ్-19కు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ లేదా ఔషధం కనిపెట్టేంత వరకు ఇంచుమించు ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు.

కరోనా వ‌ల్ల‌ జీవితమా?… జీవనోపాధా? తేల్చుకునే పరిస్థితి రావొద్దని కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ కట్టడిలో ఇండియా పనితీరును ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయన్నారు. భార‌త్ లో ముందుగా ప్రవేశపెట్టిన లాక్‌డౌన్ కారణంగా మిగతా దేశాలతో పోలిస్తే కరోనా నియంత్రించ‌డంలో భారత్ మెరుగైన పనితీరు కనబరిచిందన్నారు.