అక్కడ లిక్కర్ సేల్స్ బంద్.. ఎందుకంటే..
Liquor: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. అయితే.. చిత్తూరు జిల్లా పాలసముద్రంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. జిల్లా సరిహద్దులోని తమిళనాడు ప్రాంత వాసులు మద్యం కొనుగోలు చేసేందుకు పాలసముద్రం రావడంతో అక్కడ మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకెళితే.. లాక్‌డౌన్ కారణంగా వారి వద్ద మద్యం దుకాణాలు లేకపోవడంతో తమిళనాడు వాసులు పాలసముద్రం వస్తున్నారు. ఉదయం నుంచి మద్యం దుకాణాల వద్ద బారులుతీరుతున్న స్థానికులతో పాటు […]

Liquor: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. అయితే.. చిత్తూరు జిల్లా పాలసముద్రంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. జిల్లా సరిహద్దులోని తమిళనాడు ప్రాంత వాసులు మద్యం కొనుగోలు చేసేందుకు పాలసముద్రం రావడంతో అక్కడ మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకెళితే.. లాక్‌డౌన్ కారణంగా వారి వద్ద మద్యం దుకాణాలు లేకపోవడంతో తమిళనాడు వాసులు పాలసముద్రం వస్తున్నారు. ఉదయం నుంచి మద్యం దుకాణాల వద్ద బారులుతీరుతున్న స్థానికులతో పాటు తమిళనాడు వాసులు కూడా రావడంతో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని తమిళనాడు తహసీల్దార్లు ఏపీ అధికారులకు కోరారు. దీంతో జిల్లా అధికారులు పాలసముద్రంలో మద్యం అమ్మకాలను నిలిపివేశారు.
Also Read: 45 నిముషాల్లో రూ. 2లక్షల లోన్.. 6 నెలల వరకు నో ఈఎంఐ..