మాతో క్రికెట్ ఆడకపోతే.. భారత్‌లో టీ20 వరల్డ్‌కప్‌ బహిష్కరిస్తాం.. పాక్ బెదిరింపు!

PCB Warns BCCI: ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్‌ను నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి పాకిస్థాన్ ఆతిధ్య హక్కులను దక్కించుకుంది. ఇందులో భాగంగా టీమిండియా ఈ టోర్నమెంట్‌లో ఆడాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌లో తాము ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా కప్ టీ‌20 టోర్నీలో టీమిండియా తప్పకుండా ఆడాల్సిందేనని.. లేకుంటే 2021లో భారత్‌లో […]

మాతో క్రికెట్ ఆడకపోతే.. భారత్‌లో టీ20 వరల్డ్‌కప్‌ బహిష్కరిస్తాం.. పాక్ బెదిరింపు!
Follow us

|

Updated on: Jan 26, 2020 | 1:45 PM

PCB Warns BCCI: ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్‌ను నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి పాకిస్థాన్ ఆతిధ్య హక్కులను దక్కించుకుంది. ఇందులో భాగంగా టీమిండియా ఈ టోర్నమెంట్‌లో ఆడాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌లో తాము ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా కప్ టీ‌20 టోర్నీలో టీమిండియా తప్పకుండా ఆడాల్సిందేనని.. లేకుంటే 2021లో భారత్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌లో ఆడబోమని బీసీసీఐను పాక్ హెచ్చరించింది.

ఇదిలా ఉండగా ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం అన్ని దేశాలు తమ బెస్ట్ టీమ్స్‌ను సన్నద్ధం చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం భారత్ న్యూజిలాండ్ టూర్‌లో ఉండగా.. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇవాళ జరగనుంది. అటు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మధ్య లాహోర్ వేదికగా టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందుకోసం బంగ్లాదేశ్ మొదటిసారిగా పాకిస్థాన్‌లో పర్యటించింది. కాగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 2023-2031 మధ్యలో కనీసం మూడు ఐసీసీ టోర్నీల ఆతిధ్య హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఈ వార్నింగ్‌కు బీసీసీఐ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.