నటి పాయల్‌కు 8 రోజుల కస్టడీ..

|

Dec 16, 2019 | 5:57 PM

మాజీ ప్రధాని నెహ్రూపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన నటి పాయల్ రోహత్గీకి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను  ఐటి చట్టంలోని 66, 67 సెక్షన్ల కింద.. రాజస్థాన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం బుండి కోర్టులో పాయల్‌ను ప్రొడ్యూస్ చెయ్యగా..8 రోజుల జ్యూడిషియల్ కస్టడీని విధించింది కోర్టు. కాగా తాను గూగుల్‌లో దొరికిన సమాచారం మేరకే వీడియో చేశానని, స్వేచ్ఛగా మాట్లాగే రైట్ లేకుండా పోయిందంటూ ఆమె మరో పోస్ట్ చేశారు. […]

నటి పాయల్‌కు 8 రోజుల కస్టడీ..
Follow us on

మాజీ ప్రధాని నెహ్రూపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన నటి పాయల్ రోహత్గీకి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను  ఐటి చట్టంలోని 66, 67 సెక్షన్ల కింద.. రాజస్థాన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం బుండి కోర్టులో పాయల్‌ను ప్రొడ్యూస్ చెయ్యగా..8 రోజుల జ్యూడిషియల్ కస్టడీని విధించింది కోర్టు. కాగా తాను గూగుల్‌లో దొరికిన సమాచారం మేరకే వీడియో చేశానని, స్వేచ్ఛగా మాట్లాగే రైట్ లేకుండా పోయిందంటూ ఆమె మరో పోస్ట్ చేశారు.

నెహ్రూతో పాటు ఆయన సతీమణిపై వల్గర్ పదాలతో కూడిన ఓ వీడియో చేసిన రోహత్గీ..దాన్ని ఫేస్‌ బుక్‌లో ఫోస్ట్ చేసింది. దీనిపై కాాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.  రాజస్థాన్‌కు చెందని యూత్ కాంగ్రెస్ లీడర్ చర్మేష్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆమెకు ఉచ్చు బిగుస్తోంది.