టికెట్ బుకింగ్స్ షురూ .. పరిమిత స్టా‌ప్‌లు.. జనరల్ బోగీలు నిల్..

ఓ వైపు కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే లాక్ డౌన్ సడలింపులతో రేపటినుంచి

టికెట్ బుకింగ్స్ షురూ .. పరిమిత స్టా‌ప్‌లు.. జనరల్ బోగీలు నిల్..
Follow us

| Edited By:

Updated on: May 11, 2020 | 4:03 PM

IRCTC: ఓ వైపు కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే లాక్ డౌన్ సడలింపులతో రేపటినుంచి రైలు సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ప్రయాణికుల కోసం ఈ రోజు నుంచి ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. సోషల్ డిస్టెన్స్ నిబంధనలకు అనుగణంగా కొన్ని సీట్లకు బుకింగ్‌ అవకాశం ఉండదు రైలు ఎక్కేముందు ధర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి.

టికెట్ బుకింగ్ కేవలం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లు పనిచేయవు. ప్లాట్ ఫామ్ టికెట్లతో సహా ఎలాంటి కౌంటర్ టిక్కెట్లు జారీ చేయబడవు. ధృవీకరించబడిన టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే రైల్వే స్టేషన్లలోకి అనుమతిస్తారు. ప్రయాణీకులు ఫేస్ మాస్క్ ధరించడం, ప్రయాణానికి ముందు స్క్రీనింగ్ తప్పనిసరి. కరోనా లక్షణాలు లేని ప్రయాణీకులను మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతిస్తారు.

Also Read: కరోనా దేశీయ కిట్లు రెడీ‌.. ఒకేసారి 90 పరీక్షలు నిర్వహించే అవకాశం..