భారత పార్లమెంట్ సమావేశాలు జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 17వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌సభలో అత్యంత సీనియర్ అయిన ఎంపీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించి కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం జూన్ 19న కొత్త స్పీకర్‌ను ఎన్నుకొంటారు. ప్రొటెం స్పీకర్‌గా అత్యంత సీనియర్ అయిన మేనకాగాంధీ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజుల్లో కొత్త స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 16వ లోక్‌సభలో స్పీకర్‌గా సుమిత్రా మహాజన్‌కు అవకాశం దక్కింది. ఈ సారి ఆమె పోటీ చేయలేదు. అంతకు ముందు 15వ లోక్‌సభ కాలంలో కూడా స్పీకర్‌గా మీరా కుమార్ వ్యవహరించారు. దీంతో వరుసగా మూడోసారి కూడా మహిళకే స్పీకర్ పదవి దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి.