మీరే ఒప్పందం ఉల్లంఘించారంటూ.. భారత రాయబారికి పాక్‌ సమన్లు

సరిహద్దు రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ భారత డిప్యూటీ హైకమిషనర్‌కు పాక్‌ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్‌ గౌరవ్‌ అహ్లూవాలియాకు దక్షిణాసియా, సార్క్‌ దేశాల పాకిస్థాన్‌ డైరెక్టర్‌ జనరల్‌ మహ్మద్‌ ఫైజల్‌ నోటీసులు అందజేశారు. గురువారం ఉదయం నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ఎదురు కాల్పుల్లో.. పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, మొదట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం […]

మీరే ఒప్పందం ఉల్లంఘించారంటూ.. భారత రాయబారికి పాక్‌ సమన్లు
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2019 | 1:00 AM

సరిహద్దు రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ భారత డిప్యూటీ హైకమిషనర్‌కు పాక్‌ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్‌ గౌరవ్‌ అహ్లూవాలియాకు దక్షిణాసియా, సార్క్‌ దేశాల పాకిస్థాన్‌ డైరెక్టర్‌ జనరల్‌ మహ్మద్‌ ఫైజల్‌ నోటీసులు అందజేశారు. గురువారం ఉదయం నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ఎదురు కాల్పుల్లో.. పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, మొదట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్లే దీటుగా స్పందించాల్సి వచ్చిందని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే పాక్ అయిదుగురు భారత సైనికులను చంపామంటూ చేసిన ప్రకటనను.. భారత్ ఖండించింది.