ఉగ్రవాదులకు పాక్ స్వర్గం లాంటింది.. పాక్‌కు భారీ షాక్ ఇచ్చిన యూఎస్..

| Edited By:

Jun 25, 2020 | 5:09 PM

అగ్రరాజ్యం అమెరికా పొరుగు దేశం పాకిస్థాన్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ భూతల స్వర్గమంటూ వర్ణించింది. గతేడాది భారత్‌లోని పుల్వామా దాడి అనంతరం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ.. పాక్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అభిప్రాయపడింది.

ఉగ్రవాదులకు పాక్ స్వర్గం లాంటింది.. పాక్‌కు భారీ షాక్ ఇచ్చిన యూఎస్..
Follow us on

అగ్రరాజ్యం అమెరికా పొరుగు దేశం పాకిస్థాన్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ భూతల స్వర్గమంటూ వర్ణించింది. గతేడాది భారత్‌లోని పుల్వామా దాడి అనంతరం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ.. పాక్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అభిప్రాయపడింది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణమన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత ప్రభుత్వం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. అయితే తర్వాత దేశంలోని లష్కరే తోయిబా సంస్థ అలర్ట్ అయ్యింది. సరిహద్దు నుంచి దూరంగా ఉగ్రవాద స్థావరాలను మార్చేసింది. అయితే ఇలా చేస్తున్నప్పటికీ.. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు.. ఉగ్ర సంస్థలకు వస్తున్న నిధులను నిలువరించేందుకు కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా.. యూఎస్ కూడా ఓ నివేదిక విడుదల చేసింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థల కార్యకలాపాలకు పాక్ ప్రభుత్వం సహకరిస్తోందంటూ ఆరోపించింది. అంతేకాదు.. వీటితోపాటు తాలిబన్‌, హక్కానీ నెట్‌వర్క్‌ వంటి సంస్థలకు కూడా.. పాక్ షెల్టర్లు కల్పిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా ఉగ్ర సంస్థలకు నిధులు రాకుండా అడ్డుకోవడంలో పాక్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఈ కారణంగానే ఉగ్రవాదులు భారత్‌లో దాడులు చేస్తున్నారంటూ పరోక్షంగా తెలిపింది. ఇక అంతర్జాతీయంగా పాక్ ఉగ్రవాదాన్ని నిలువరిస్తుందన్నట్లు వ్యవహరించేందుకు లష్కరే చీఫ్ హఫీజ్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు నటించిందని నివేదికలో పేర్కొంది. అయితే ఈ రిపోర్టు కారణంగా ఇప్పుడు పాక్ మళ్లీ గ్రే లిస్టులోనే కొనసాగుతోంది. ఎఫ్‌ఏటీఎఫ్ అక్టోబర్ వరకు పాక్‌ను గ్రే లిస్టులోనే ఉంచుతున్నట్లు ప్రకటించింది.