ఫ్రెంచ్ వైమానిక దాడుల్లో 50 మంది అల్ ఖైదా ఉగ్రవాదుల ఊచకోత

సెంట్రల్ మాలిలో తమ సైనిక దళాలు వైమానిక దాడులు జరిపి 50 మందికి పైగా ఆల్ ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులను హతమార్చాయని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది.

ఫ్రెంచ్ వైమానిక దాడుల్లో 50 మంది అల్ ఖైదా ఉగ్రవాదుల ఊచకోత
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 03, 2020 | 11:10 AM

సెంట్రల్ మాలిలో తమ సైనిక దళాలు వైమానిక దాడులు జరిపి 50 మందికి పైగా ఆల్ ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులను హతమార్చాయని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది. గత శుక్రవారం బుర్కినాఫాసో, నైగర్ సమీపంలో ఈ దాడులు జరిగినట్టు ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లారెన్స్ పార్లీ తెలిపారు.  ఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రినిస్వాధీనం చేసుకున్నట్టు ఆమె .చెప్పారు. సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో మోటార్ సైకిల్ కారవాన్ జరుగుతున్నట్టు తమ దేశ డ్రోన్ కనుగొన్నదని, దీంతో రెండు జెట్ ఫైటర్లు దాడులు జరిపాయని ఆమె వెల్లడించారు. కొందరు జిహాదిస్టులు చెట్లలో దాక్కుని పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. అల్ ఖైదాతో లింక్ ఉన్న ఆన్సరుల్  ఇ స్లామ్ గ్రూప్ కి ఇది పెద్ద దెబ్బ అని ఆమె అన్నారు.