అసోం అతలాకుతలం.. 25 జిల్లాల్లో వరద బీభత్సం.. 25 మంది మృతి..

| Edited By:

Jul 01, 2020 | 8:56 AM

భారీ వర్షాలతో అసోం అతలాకుతలం అవుతోంది. బ్రహ్మపుత్ర ఉదృతంగా ప్రవహిస్తుంది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపిన నివేదిక ప్రకారం.. ఉడల్‌గురి, కమ్రప్‌(మెట్రో) ప్రాంతాల్లో ప్రస్తుతానికి వరద ఉథృతి

అసోం అతలాకుతలం.. 25 జిల్లాల్లో వరద బీభత్సం.. 25 మంది మృతి..
Follow us on

Assam Floods: భారీ వర్షాలతో అసోం అతలాకుతలం అవుతోంది. బ్రహ్మపుత్ర ఉదృతంగా ప్రవహిస్తుంది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపిన నివేదిక ప్రకారం.. ఉడల్‌గురి, కమ్రప్‌(మెట్రో) ప్రాంతాల్లో ప్రస్తుతానికి వరద ఉథృతి తగ్గగా థెమాజీ, దక్షిణ సల్మారా, లఖంపూర్‌, నల్బరి, బార్పేట, కోక్రాజార్‌, గోల్‌పారా, కమ్రప్‌, మోరిగావ్‌, గోలఘాట్‌, జోర్హాట్‌, దిర్హాట్‌ తదితర జిల్లాలో కొనసాగుతుంది.

భారీ వర్షాలు, వరదల కారణంగా అసోంలో దుర్భర పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా 25 జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది 13.2 లక్షల మంది వరదల కారణంగా ప్రభావానికి గురయ్యారు. మృతుల సంఖ్య 25కు చేరుకుంది. నివేదిక ప్రకారం బార్పేట జిల్లా వరదల కారణంగా అత్యంత ప్రభావానికి గురైంది. జిల్లాలో 75,700 హెక్టార్ల వ్యవసాయ భూమి కోతకు గురైంది. గడిచిన 24 గంటల్లో జిల్లా యంత్రాంగం 3,245 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

మొరిగావ్‌లోని పోబిటోరా వన్యప్రాణాల అభయారణ్యం, మంగల్‌డోయిలోని ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్, గోలాఘాట్‌లోని కజిరంగ నేషనల్‌ పార్కు లను వరదలు ముంచెత్తాయి. 21 జిల్లాల్లో అధికారులు 265 సహయక శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిలో 25,461 మందికి ఆశ్రయం కల్పించారు. గౌహతి, జోర్హాట్‌లోని నీమాటిఘాట్‌, సోనిత్‌పూర్‌లోని తేజ్‌పూర్‌, గోల్‌పారా పట్టణం, దుబ్రీ పట్టణాల వద్ద బ్రహ్మపుత్ర నదీ ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోంది.