బ్రేకింగ్.. సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ పార్టీపై ఉగ్రదాడి
కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. బుధవారం తెల్లవారుజామున సోపోర్ ప్రాంతలో సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ పార్టీపై కాల్పులకు పాల్పడ్డారు. సోపోర్‌లోని మోడల్ టౌన్ వద్ద..

కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. బుధవారం తెల్లవారుజామున సోపోర్ ప్రాంతలో సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ పార్టీపై కాల్పులకు పాల్పడ్డారు. సోపోర్‌లోని మోడల్ టౌన్ వద్ద నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడి జరిపారని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బగ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారని.. పలువురు సామాన్య ప్రజలు కూడా స్వల్పగాయాల పాలయ్యారన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నామని.. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Terrorists attacked a naka party at Model town in Sopore. Injuries to some Central Reserve Police Force (CRPF) jawans and a civilian reported. Area cordoned off and search operation started: Dilbag Singh, DGP Jammu & Kashmir Police (file pic) https://t.co/uAVm7DG5Bu pic.twitter.com/ZhwoZ5tLUy
— ANI (@ANI) July 1, 2020